Shahid OTT: 11ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ సినిమా-shahid ott release rajkumar rao biographical drama movie streaming started in amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shahid Ott: 11ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ సినిమా

Shahid OTT: 11ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ సినిమా

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 11, 2024 12:44 PM IST

Shahid OTT Streaming: షాహిద్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన పదకొండేళ్ల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ మూవీకి గాను రాజ్‍కుమార్ రావ్‍కు జాతీయ అవార్డు కూడా దక్కింది. షాహిద్ మూవీ ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవుతోందంటే..

Shahid OTT: 11ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ సినిమా
Shahid OTT: 11ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ సినిమా

Shahid OTT: బాలీవుడ్ హీరో రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్ర పోషించిన షాహిద్ సినిమా విమర్శకుల ప్రశంసలను పొందింది. కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన షాహిద్ సినిమా 2013లో థియేటర్లలో రిలీజ్ అయింది. న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త షాహిద్ అజ్మి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి గాను రాజ్‍కుమార్ రావ్‍కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది. ఈ షాహిద్ సినిమా థియేటర్లలో రిలీజైన 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

స్ట్రీమింగ్ వివరాలు

షాహిద్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఈ చిత్రం రెంట్ విధానంలో ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్‍కు తీసుకురావడం పట్ల ఆ మూవీ డైెరెక్టర్ షాహిద్ ఆశ్చర్యవ్యక్తం చేశారు.

ఎందుకిలా..

షాహిద్ సినిమా ఎక్కడైనా థియేటర్లలో అందుబాటులో ఉందా.. మరి ఎందుకు రెంటల్ పద్ధతిలో ఓటీటీలోకి తీసుకొచ్చారని దర్శకుడు హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. “ఎట్టకేలకు ప్రైమ్ వీడియోలో షాహిద్ చిత్రం వచ్చింది. ఇది థియేటర్లలో ఎక్కడైనా అందుబాటులో ఉందా. రెంట్‍పై ఎందుకని ఆశ్చర్యంగా ఉంది” అని ఆయన రాసుకొచ్చారు.

షాహిద్ చిత్రం ప్రస్తుతం రూ.119 రెంట్‍తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే, త్వరలో సబ్‍స్క్రైబర్లందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

షాహిద్ సినిమాలో రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్ర చేయగా.. మహమ్మద్ జెషాన్ అయ్యుబ్, తిగ్మాన్షు ధూలియా, కేకే మీనన్, ప్రభ్లీన్ సంధు, ప్రబల్ పంజాబీ, వివేక్ ఘమండే కీలక క్యారెక్టర్లు పోషించారు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనురాగ్ కశ్యప్, సునీల్ బోహ్రా, రోనీ స్క్రీవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. షాహిద్ మూవీకి గాను 61వ చలనచిత్ర జాతీయ అవార్డుల్లో.. ఉత్తమ నటుడిగా రాజ్‍కుమార్ రావ్‍కు అవార్డు దక్కింది.

రాజ్‍కుమార్ రావ్ ‘శ్రీకాంత్’ మూవీ

రాజ్ కుమార్ రావ్ ప్రస్తుతం ‘శ్రీకాంత్’ అనే మూవీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన అంధుడు, పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ బొల్లా సవాళ్లను ఎదుర్కొని విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా ఎదిగిన అంశాలపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే శ్రీకాంత్ ట్రైలర్ వచ్చింది. శ్రీకాంత్ పాత్రతో రాజ్‍కుమార్ రావ్ నటన మెప్పించింది.

శ్రీకాంత్ సినిమాలో రాజ్‍కుమార్ రావ్‍తో పాటు జ్యోతిక, ఆలియా ఎఫ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

శ్రీకాంత్ బొల్లా 1991లో ఆంధ్రప్రదేశ్‍లోని మచిలీపట్నంలో జన్మించారు. కంటిచూపు లేని కారణంగా చిన్నతనం నుంచే ఆయన ఇబ్బందులు పడ్డారు. అయితే, పట్టుదలతో కష్టపడి ప్రతికూలతను అనూకూలంగా మార్చుకున్నారు. చదువులో అద్భుతంగా రాణించారు. హైదరాబాద్‍లో ఆయన బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు. విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా ఎదిగారు.

IPL_Entry_Point