Farzi Series Release Date: ఫర్జీ సిరీస్‌తో రాబోతున్న షాహీద్ కపూర్, విజయ్ సేతుపతి
Farzi Series Release Date: షాహీద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఫర్జీ(Farzi) సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్.
Farzi Series Release Date: ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శక ద్వయం రాజ్-డీకే. ప్రస్తుతం వీరిద్దరూ రూపొందించిన మరో వినూత్న షో ఫర్జీ(Farzi). బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు సంబంధించిన సరికొత్త అప్డేట్ వచ్చింది. ఫర్జీ సిరీస్‌ను ప్రైమ్ వీడియో వేదికగా విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ ఈ మేరకు షాహీద్, విజయ్ సేతుపతి పోస్టర్లతో పాటు విడుదల తేదీని ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
ఫర్జీ షోను అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల కానుంది. 2023 ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లను గమనిస్తే.. షాహీద్ కపూర్ గుబురు గడ్డంతో క్యాజువల్ దుస్తుల్లో దర్శనమివ్వగా.. విజయ్ సేతుపతి సూట్‌లో ఉన్నతాధికారిగా కనిపించాడు. ఈ పోస్టర్లను బట్టి చూస్తే ఇందులో షాహీద్ రౌడీగా, విజయ్ సేతుపతి ప్రభుత్వాధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ పోస్టర్లపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. షాహీద్ కపూర్ మాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడని, తను ఈ సిరీస్ చూడాలనుకుంటున్నాని ఓ యూజర్ పోస్ట్ చేయగా.. విజయ్ సేతుపతి లుక్‌పై మరికొంతమంది స్పందించారు. ఈ సిరీస్ ఎలాగైన సూపర్ హిట్ అవుతుందని మరో యూజర్ స్పష్టం చేశారు.
ఈ సిరీస్‌లో కేకే మీనన్, రాశీ ఖన్నా, అమోల్ పాలేకర్, రెజీనా కసాండ్ర, భువన్ అరోరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ 8 ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సిరీస్ తెరకెక్కింది.
ఫ్యామిలీ మ్యాన్ లాంటి విజయవంతమైన సిరీస్ తర్వాత ప్రైమ్ వీడియోతో కలవడం చాలా ఆనందంగా ఉందని రాజ్-డీకే స్పష్టం చేశారు. "ఇది మాకు ఇష్టమైన స్క్రిప్టుల్లో ఒకటి. ఎంతో అభిరుచితో దీన్ని సృష్టించాం. ఈ సిరీస్ రూపొందించడానికి ఎంతో కష్ట పడ్డాం. ఫిబ్రవరి 10న ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది." అని వారు తెలిపారు.
సంబంధిత కథనం