Shah Rukh Khan visits Vaishno Devi: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో అతడు మరోసారి జమ్ముకశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్లడం విశేషం. ఈ ఏడాది మొదట్లో రిలీజైన పఠాన్ మూవీ రిలీజ్ కు ముందు, తర్వాత జవాన్ కోసం కూడా కింగ్ ఖాన్ ఈ ఆలయానికి వెళ్లాడు.
తాజాగా డంకీ రిలీజ్ కు మరో పది రోజుల సమయం ఉండగా.. మరోసారి వైష్ణో దేవిని దర్శించుకున్నాడు. ఈ ఏడాది రిలీజైన పఠాన్, జవాన్ సినిమాలు రెండూ రూ.1000 కోట్లకుపైనే వసూలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు డంకీ కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశతో ఉన్నారు. షారుక్ ఖాన్ కూడా వైష్ణో దేవి ఆశీస్సులు తనకు బాగానే కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.
జమ్ము కశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయానికి షారుక్ ఎప్పుడు వెళ్లినా.. అభిమానుల కంట పడకుండా వెళ్లడానికే అతడు ప్రయత్నిస్తాడు. ఇప్పుడు కూడా ఆలయంలో అడుగు పెట్టే సమయంలో హుడీ షర్ట్ వేసుకొని తన ముఖం ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో షారుక్ ముఖం కనిపించకపోయినా.. అక్కడున్న వాళ్లు మాత్రం అతడు కింగ్ ఖానే అని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
2023లో రిలీజైన షారుక్ సినిమాల్లో పఠాన్ రూ.1054 కోట్లు, జవాన్ రూ.1125 కోట్లు వసూలు చేశాయి. దీంతో డంకీ మూవీపైనా భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ తొలిసారి నటించడంతో ఈ మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే సినిమా నుంచి ఐదు డ్రాప్స్ వచ్చాయి. అందులో నాలుగు సాంగ్స్ కాగా.. ఒకటి ట్రైలర్.
లండన్ వెళ్లాలని కలలు కనే ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ డంకీ. డిసెంబర్ 21న మూవీ రిలీజ్ కానుంది. అయితే మరుసటి రోజే ప్రభాస్ సలార్ రిలీజ్ కానుండటంతో డంకీకి బాక్సాఫీస్ దగ్గర గట్టీ పోటీ తప్పేలా లేదు. డంకీ మూవీలో షారుక్ తోపాటు తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ నటించారు.
టాపిక్