Shah Rukh Khan Remuneration: ఒక్క సినిమాతోనే రూ.200 కోట్లు అందుకున్న స్టార్ హీరో.. రికార్డులు బ్రేక్-shah rukh khan remunerationm for pathaan touches 200 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh Khan Remunerationm For Pathaan Touches 200 Crores

Shah Rukh Khan Remuneration: ఒక్క సినిమాతోనే రూ.200 కోట్లు అందుకున్న స్టార్ హీరో.. రికార్డులు బ్రేక్

Hari Prasad S HT Telugu
Apr 19, 2023 05:56 PM IST

Shah Rukh Khan Remuneration: ఒక్క సినిమాతోనే రూ.200 కోట్లు అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో. ఈ దెబ్బతో అన్ని రికార్డులు బ్రేక్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు షారుక్ ఖాన్.

పఠాన్ మూవీలో షారుక్ ఖాన్
పఠాన్ మూవీలో షారుక్ ఖాన్ (HT_PRINT)

Shah Rukh Khan Remuneration: బాలీవుడ్ బాద్‌షాగా పేరుగాంచిన షారుక్ ఖాన్ తనకు ఎందుకు ఆ పేరు వచ్చిందో మరోసారి నిరూపించాడు. ఒకే సినిమా కోసం అతడు ఏకంగా రూ.200 కోట్లు అందుకోవడం విశేషం. కింగ్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత కనిపించిన మూవీ పఠాన్ ద్వారా అతడు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నాడు.

ఈ ఏడాది జనవరి 25న రిలీజైన పఠాన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్లతో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీలో నాలుగేళ్ల తర్వాత తమ అభిమాన హీరోను చూసిన అభిమానులు.. సినిమాను సూపర్ హిట్ చేశారు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పఠాన్ కలెక్షన్ల వర్షం కురిపించింది.

రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాలు చుట్టు ముట్టినా.. ఫ్యాన్స్ అవేవీ పట్టించుకోలేదు. 2018లో జీరో సినిమా ఫ్లాప్ తర్వాత కింగ్ ఖాన్ నటించిన సినిమా ఇదే. దీంతో పఠాన్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో షారుక్ తోపాటు దీపికా పదుకోన్, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా, అషుతోశ్ రాణా కూడా నటించారు.

అయితే ఈ సినిమా కోసం మొదట షారుక్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. కాకపోతే లాభాల్లో 60 శాతం వాటా కావాలని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాలీవుడ్ హంగామాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. లాభాల్లో 60 శాతం అంటే రూ.200 కోట్లు కావడం విశేషం. ఇండియాలో ఒక సినిమాకు ఈ స్థాయి రెమ్యునరేషన్ గతంలో ఎప్పుడూ లేదు.

పఠాన్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగానే ఎగబడ్డారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన పఠాన్.. తొలి రోజు ఏకంగా రూ.57 కోట్ల వసూళ్లు సాధించింది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.