Jawan First Review: షారుక్ ఖాన్ జవాన్ ఫస్ట్ రివ్యూ.. స్టోరీ, బీజీఎమ్ ఎలా ఉన్నాయంటే?
Jawan Movie First Review: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shahrukh Khan) తాజాగా నటించిన చిత్రం జవాన్. పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. అయితే ఇంతలోనే జవాన్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
హిందీ చిత్రసీమలో బాద్ షాగా ఎంతోకాలంగా అలరిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan). తన డ్యాన్స్, యాక్టింగ్‍తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఖాన్ త్రయంలో టాప్ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. బాలీవుడ్‍కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ జవాన్‍గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు షారుక్ ఖాన్. టాప్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారీ తారాగణం
భారీ అంచనాలను మరింత పెంచేలా జవాన్ గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ ఉన్నాయి. ఆగస్ట్ 31న విడుదలై జవాన్ ట్రైలర్‍కు బీభత్సమైన స్పందన వచ్చింది. ఇందులో షారుక్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో అలరించనున్నాడని అర్థమవుతోంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్‍తోపాటు బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె, లేడి సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, దంగల్ భామ సాన్య మల్హోత్రా, యోగిబాబు, అసుర్ సిరీస్ ఫేమ్ రిధి డోగ్రా, ఇజాజ్ ఖాన్ కీలక పాత్రలు పోషించనున్నారు. అన్నిటికిమించి జవాన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్‍పై సంగీతం అందించాడు.
న్యాయం చేసే సినిమా
జవాన్ మూవీ సెప్టెంబర్ 7న హిందీతోపాటు తెలుగు, తమిళంలో విడుదల కానుంది. అయితే ఓవర్సీస్‍లో సెన్సార్ చేసిన జవాన్ సినిమాను వీక్షించినట్లుగా బాలీవుడ్ కాంట్రవర్సీ క్రిటిక్ ఉమర్ సంధు తెలిపాడు. అలాగే జవాన్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. "షారుక్ ఖాన్ నటనాప్రతిమకు పర్ఫెక్ట్ న్యాయం చేసే సినిమా జవాన్. అద్భుతమైన కథకు షారుక్ ఖాన్ సూపర్బ్ ఎనర్జీ తోడై కరెక్ట్ సింక్‍లో సినిమా ఉంది. ఛాలెంజింగ్ మెయిన్ రోల్‍లో షారుక్ ఖాన్ అందరి మనసులను ఆకట్టుకున్నాడు" అని ఉమర్ సంధు ట్విటర్ వేదికగా తెలిపాడు.
రికార్డులన్నీ బద్దలు
ఉమర్ సంధు ఇంకా కొనసాగిస్తూ.. "జవాన్ మూవీ బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. థ్రిల్లింగ్, క్రేజీగా ఉండి మజా ఇచ్చింది. జవాన్ ఒక సాలిడ్ ఎంటర్టైనర్. అందులో రెండో అభిప్రాయం లేదు. ఇది కచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన సినిమా మాత్రమే కాదు దానిలో మంచి సోల్ ఉంది. అది సినీప్రియులకు బాగా నచ్చుతుంది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే గత సినిమాల రికార్డులన్నీ జవాన్ కొల్లగొడుతుంది" అని చెబుతూ జవాన్ సినిమాకు 5కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.