Shah Rukh Khan: గుడ్ న్యూస్.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన షారుక్ ఖాన్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. వడదెబ్బ తగిలి అతడు అహ్మదాబాద్ లోని హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే.
Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు, ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్ అహ్మదాబాద్ లోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మంగళవారం (మే 21) అతడు సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ మ్యాచ్ చూడటానికి అహ్మదాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడే అతనికి వడ దెబ్బ తగలడంతో వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.

షారుక్ బాగానే ఉన్నాడు
రెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత షారుక్ ను డిశ్చార్జ్ చేశారు. అంతకుముందు గురువారం (మే 23) మధ్యాహ్నమే షారుక్ ఖాన్ పూర్తిగా కోలుకున్నాడని అతని మేనేజర్ పూజా దద్లానీ వెల్లడించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయం తెలిపింది. అహ్మదాబాద్ లోని కేడీ హాస్పిటల్లో అతడు చికిత్స తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతని ఆరోగ్యంపై అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఓం ప్రకాశ్ జాట్ కూడా అప్డేట్ ఇచ్చారు.
"నటుడు షారుక్ ఖాన్ అహ్మదాబాద్ లోని కేడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు" అని ఆయన చెప్పారు. అంతకుముందు అతనికి వడ దెబ్బ తగలడంతోపాటు డీహైడ్రేషన్ కు గురై హాస్పిటల్లో చేరినట్లు కూడా అహ్మదాబాద్ ఎస్పీయే తెలిపారు. మంగళవారం షారుక్.. అహ్మదాబాద్ రాగా.. ఆ రోజు స్టేడియంలో ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ చూశాడు. తర్వాత గ్రౌండ్లోకి కూడా వచ్చి ప్లేయర్స్ ను కలిశాడు.
అయితే మరుసటి రోజు ఉదయమే అతన్ని హాస్పిటల్లో చేర్చారన్న వార్తతో అభిమానులు ఉలిక్కి పడ్డారు. ఆ వెంటనే అతని భార్య గౌరీ ఖాన్, బాలీవుడ్ నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా కూడా కేడీ హాస్పిటల్ కు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత షారుక్ కోలుకుంటున్నాడని జూహీ తెలిపింది. ఈ ఇద్దరు కలిసే ప్రొడక్షన్ కంపెనీ నడుపుతుండటంతోపాటు కేకేఆర్ టీమ్ ను కూడా కొనుగోలు చేశారు.
ఫైనల్లోకి కేకేఆర్
ఇక ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ చేరింది. ఆ టీమ్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరి ట్రోఫీ గెలిచింది. 2012, 2014లో ట్రోఫీ గెలిచిన సమయంలో కెప్టెన్ గా ఉన్న గంభీర్.. ఇప్పుడు టీమ్ మెంటార్ గా ఉన్నాడు. ఈసారి మే 26న అహ్మదాబాద్ లో ఫైనల్ ఆడాల్సిందే అని సీజన్ ప్రారంభానికి ముందే ప్లేయర్స్ తో చెప్పిన గంభీర్..చివరికి చెప్పినట్లే చేశాడు. దీంతో ఈసారి ఆ టీమ్ మూడో టైటిల్ గెలవడం ఖాయమన్న ఆశతో ఆ టీమ్ ఫ్యాన్స్ ఉన్నారు.
మరోవైపు షారుక్ ఖాన్ గతేడాది పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు కింగ్ అనే యాక్షన్ థ్రిల్లర్ లో అతడు నటిస్తున్నాడు. ఇందులో అతని కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ఇక టైగర్ వెర్సెస్ పఠాన్ అనే మరో మూవీలోనూ నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పైయూనివర్స్ లో భాగంగా తెరకెక్కే మూవీ.
టాపిక్