Netflix Web Series: ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ రిలీజ్‌పై ఎట్టకేలకి షారూక్ ఖాన్ క్లారిటీ, భిన్నమైన దారిలో బాద్‌షా కొడుకు
Aryan Khan Web Series; షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆర్యన్ హీరోగా వస్తాడని అంతా ఎదురుచూస్తుంటే… ఆశ్చర్యపరుస్తూ డైరెక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు.
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఎట్టకేలకి తన కుమారుడి ఆర్యన్ ఖాన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వట్లేదు. అతను దర్శకుడిగా ఒక వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. ఈ సిరీస్ కథ ప్రస్తావనలోకి వెళ్లని షారూక్ ఖాన్.. కేవలం జస్ట్ తన కుమారుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడని మాత్రమే వెల్లడించాడు.
నిర్మాతగా షారూక్ ఖాన్ భార్య
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సంయుక్తంగా షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ వెబ్ సిరీస్‌కి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ ఈ వెబ్ సిరీస్‌కి పేరు పెట్టలేదు. కానీ.. బాలీవుడ్ సినీ నేపథ్యంలోనే కథ ఉంటుందని మాత్రం షారూక్ ఖాన్ సంకేతాలిచ్చాడు. ఈ వెబ్ సిరీస్‌కి ‘స్టార్ డమ్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వెబ్ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్‌లు
ఈ వెబ్ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్‌లు ఉంటాయని ప్రచారం జరుగుతుండగా.. ఎవరెవరు నటించారు? అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. కొంత మంది స్టార్ హీరోలు కూడా ఈ సిరీస్‌లో గెస్ట్ రోల్ చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఓటీటీలోకి సిరీస్
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. హిట్ డార్క్ కామెడీ చిత్రం డార్లింగ్స్, క్రైమ్ డ్రామా భక్షక్, కాప్ డ్రామా చిత్రం క్లాస్ ఆఫ్ 83, జాంబీ హారర్ సిరీస్ బేతాళ్, స్పై థ్రిల్లర్ సిరీస్ బార్డ్ ఆఫ్ బ్లడ్ ఈ భాగస్వామ్యంలోనే వచ్చాయి. దాంతో ఆర్యన్ ఖాన్ సిరీస్‌పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి రాబోతుందుని షారూక్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.