Shaakuntalam OTT Release Date: మూడు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతున్న సమంత శాకుంతలం - స్ట్రీమింగ్ డేట్ ఇదే
Shaakuntalam OTT Release Date: సమంత శాకుంతలం సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సినిమా ఏ ఓటీటీలో, ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే....
Shaakuntalam OTT Release Date: సమంత శాకుంతలం సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజుల కాకముందే ఓటీటీలోకి రాబోతున్నది. మే 12న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. సమంతకు తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 20 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ థియేటర్ రిలీజ్‌కు ముందే సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
మే 12న తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలిసింది. పౌరాణిక కథాంశంతో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. కథ, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రధాన పాత్రధారుల యాక్టింగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
దాదాపు అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇరవై కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రంగా నష్టాలను మిగిల్చింది. ఫెయిల్యూర్ టాక్ కారణంగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది.
కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత నటించగా దుష్యంతుడిగా దేవ్‌మోహన్ కనిపించాడు. మోహన్‌బాబు, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్, గౌతమ్, మధుబాల కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను గుణశేఖర్ తనయ నీలిమ గుణతో కలిసి దిల్‌రాజు నిర్మించాడు.