Shaakuntalam Trolls: డిజాస్టర్ సినిమాలకు అవార్డులు ఇస్తారా - శాకుంతలం సినిమాను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
Shaakuntalam Trolls: సమంత శాకుంతలం సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయంటూ గురువారం నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌ను ఉద్దేశించి సోషల్‌మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తోన్నారు.
Shaakuntalam Trolls: సమంత శాకుంతలం సినిమాను మరోసారి సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. పౌరాణిక కథాంశంతో సమంత తొలిసారి చేసిన చేసిన ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్, సమంత, దేవ్‌మోహన్ ల యాక్టింగ్‌పై విమర్శలొచ్చాయి. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ గురువారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు గురువారం నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా...బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్‌గా శాకుంతలం అవార్డులను గెలుచుకున్నదని ఈ పోస్టర్‌లో ప్రకటించారు.
అంతే కాకుండా కేన్స్ స్క్రీనింగ్‌కు ఈ సినిమా ఎంపికైనట్లు వెల్లడించారు. వీటితో పాటు మరికొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ శాకుంతలం సినిమాకు అవార్డులు వచ్చినట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిజాస్టర్ సినిమాలకు అవార్డులు ఇస్తారా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తోన్నారు.
ఈ సినిమాకు ఏ ప్రాతిపదికన అవార్డులు ఇచ్చారు? అవార్డులు గెలుచుకోవడానికి ఈ సినిమాలో ఏముందో చెప్పాలంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇవన్నీ ఫేక్ అవార్డులు అంటూ ఓ యూజర్ పేర్కొన్నాడు. ఇలాగే వదిలిస్తే ఆస్కార్ వచ్చిదని అంటారని మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు.
ఈ ట్రోల్స్ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో శకుంతలగా సమంత నటించగా, దుష్యంతుడి పాత్రను దేవ్‌మోహన్ పోషించారు. మోహన్‌బాబు, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలను పోషించారు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 20 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలు దిల్‌రాజు, నీలిమ గుణలకు భారీగా నష్టాలను మిగిల్చింది.