Seven creates history: ఈ పాటను 100 కోట్ల సార్లు విన్నారు.. అదీ 108 రోజుల్లోనే.. మీరు విన్నారా?-seven creates history 1 billion spotify streams in just 108 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Seven Creates History: ఈ పాటను 100 కోట్ల సార్లు విన్నారు.. అదీ 108 రోజుల్లోనే.. మీరు విన్నారా?

Seven creates history: ఈ పాటను 100 కోట్ల సార్లు విన్నారు.. అదీ 108 రోజుల్లోనే.. మీరు విన్నారా?

Hari Prasad S HT Telugu
Oct 30, 2023 04:11 PM IST

Seven creates history: ఈ పాటను 100 కోట్ల సార్లు విన్నారు.. అదీ 108 రోజుల్లోనే కావడం విశేషం. మరి ఈ పాటను మీరు విన్నారా? కొరియన్ సింగర్ జంగ్‌కూక్(Jungkook) సాంగ్ సెవెన్ స్పాటిఫై (Spotify)లో రికార్డు క్రియేట్ చేసింది.

పాపులర్ కొరియన్ పాప్ సింగర్ జంగ్‌కూక్
పాపులర్ కొరియన్ పాప్ సింగర్ జంగ్‌కూక్

Seven creates history: బీటీఎస్ మెంబర్ జంగ్‌కూక్ కు చెందిన సెవెన్ (Seven) సాంగ్ స్పాటిఫై (Spotify)లో అత్యంత వేగంగా 100 కోట్ల స్ట్రీమ్స్ అందుకున్న పాటగా రికార్డు క్రియేట్ చేసింది. సోమవారం (అక్టోబర్ 30) ఈ కొరియన్ సింగర్ పాట ఈ రికార్డును అందుకోవడం విశేషం. సాంగ్ స్పాటిఫైలోకి వచ్చిన 108 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది.

yearly horoscope entry point

ఇంతకు ముందే ఈ రికార్డు మిలీ సైరస్ పేరు మీద ఉంది. ఆమె సాంగ్ ఫ్లవర్స్ 112 రోజుల్లో స్పాటిఫై 100 కోట్ల స్ట్రీమ్స్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా జంగ్‌కూక్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ విషయం తెలియగానే సోషల్ మీడియాలో అభిమానులు అతనికి శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. జంగ్‌కూక్ తన సెవెన్, 3డీ సింగిల్స్ రీమిక్స్ వెర్షన్ లు తీసుకొచ్చిన సమయంలోనే సెవెన్ ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

జంగ్‌కూక్ సౌత్ కొరియాకు చెందిన సింగర్. 26 ఏళ్ల ఈ సింగర్ పాపులర్ బీటీఎస్ బ్యాండ్ లో మెంబర్. కొరియన్ పాప్ సాంగ్స్ లో అతని స్పెషాలిటీ. 2013లో తొలిసారి బీటీఎస్ బ్యాండ్ మెంబర్ గా 2 కూల్ 4 స్కూల్ సింగిల్ తో పరిచయమయ్యాడు. ఆ తర్వాత బీటీఎస్ బ్యాండ్ లోనే మూడు సోలో సాంగ్స్ పాడాడు. 2016లో వింగ్స్ ఆల్బమ్ లో భాగంగా బిగిన్ అనే పాప్ ట్రాక్ పాడాడు.

ఇది తన సొంత జర్నీని సూచిస్తూ సాగిపోయే పాట. ఇక 2018లో యుఫోరియా పేరుతో 9 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తోపాటు మరో సాంగ్ రిలీజైంది. ఇక తాజాగా సెవెన్ సాంగ్ జులై 14న స్పాటిఫైలోకి రాగా.. 108 రోజుల్లోనే 100 కోట్ల స్ట్రీమ్స్ కావడం విశేషం.

Whats_app_banner