Divija Prabhakar: హీరోయిన్‌గా సీరియ‌ల్ ఆర్టిస్ట్ ప్ర‌భాక‌ర్ కూతురు - టైటిల్ రివీల్ చేసిన అన‌సూయ‌-serial actor prabhakar daughter divija prabhakar to make debut as heroine with hey chikitha movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Divija Prabhakar: హీరోయిన్‌గా సీరియ‌ల్ ఆర్టిస్ట్ ప్ర‌భాక‌ర్ కూతురు - టైటిల్ రివీల్ చేసిన అన‌సూయ‌

Divija Prabhakar: హీరోయిన్‌గా సీరియ‌ల్ ఆర్టిస్ట్ ప్ర‌భాక‌ర్ కూతురు - టైటిల్ రివీల్ చేసిన అన‌సూయ‌

Nelki Naresh HT Telugu
Published Feb 16, 2025 07:25 AM IST

Divija Prabhakar: సీరియ‌ల్ ఆర్టిస్ట్ ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ప్ర‌భాక‌ర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. హే చికీతా పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ మూవీలో వైఫ్ ఆఫ్ ఫేమ్ అభిన‌వ్ మ‌ణికంఠ హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ సినిమాకు ధ‌న‌రాజ్ లెక్క‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

దివిజ ప్ర‌భాక‌ర్
దివిజ ప్ర‌భాక‌ర్

Divija Prabhakar: సీరియ‌ల్ ఆర్టిస్ట్ ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ప్ర‌భాక‌ర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీతో ఓ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ద్రి సినిమాలోని సూప‌ర్ హిట్ సాంగ్‌ను పేరుగా ఫిక్స్ చేశారు. హే చికీతా అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీలో వైఫ్ ఆఫ్ ఫేమ్ అభినవ్ మణికంఠ హీరోగా న‌టిస్తోన్నాడు. దివిజ ప్రభాకర్‌తో పాటు తన్మయి మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. సినిమాటోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్ గ‌రుడ వేగ అంజి...అశోక ఆర్ఎన్ఎస్‌తో క‌లిసి హే చికితా సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ...

ఈ రొమాంటిక్ మూవీతో ధ‌న‌రాజ్ లెక్క‌ల డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. హే చికీతా మూవీలో 30 ఇయ‌ర్స్ పృథ్వీ రాజ్,దేవి ప్రసాద్, ప్రభాకర్, వీర శంకర్, బలగం సుజాతతో పాటు మై విలేజ్ షో ఫేమ్‌ అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. హే చికితా మూవీ టైటిల్ ని డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్, సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా రివీల్‌ చేశారు.

వాలెంటైన్స్ డే...

వాలెంటైన్స్ డే రోజు నుంచి హే చికీతా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. . తెలంగాణ, ఏపీలోని పలు అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను జ‌రుపుతామ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. హే చికితా మూవీకి చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

డెబ్యూ మూవీ…

హే చికీతా హీరోయిన్‌గా త‌న డెబ్యూ మూవీ అని, సినిమా లాంఛ్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని దివిజ ప్ర‌భాక‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఈ మూవీని ప్రేక్ష‌కులకు చూపించే రోజు కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది.

బ్ర‌హ్మా ఆనందం...

బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఇటీవ‌ల రిలీజైన బ్ర‌హ్మా ఆనందం మూవీలో దివిజ ప్ర‌భాక‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. వాలెంటైన్స్ డే రోజున రిలీజైన ఈ మూవీతోనే ఫ‌స్ట్ టైమ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై దివిజ ప్ర‌భాక‌ర్ క‌నిపించింది. ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. హే చికీతాతో పాటు వెంక‌ట‌రామ‌య్య‌గారి తాలూకా పేరుతో తెలుగులో మ‌రో మూవీ చేస్తోంది దివిజ ప్ర‌భాక‌ర్‌.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం