Actress Meena: రెండో పెళ్లిపై మరోసారి స్పందించిన నటి మీనా.. రూమర్లపై ఆగ్రహం-senior actress meena responded on her second marriage rumours again says ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Senior Actress Meena Responded On Her Second Marriage Rumours Again Says

Actress Meena: రెండో పెళ్లిపై మరోసారి స్పందించిన నటి మీనా.. రూమర్లపై ఆగ్రహం

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 25, 2024 07:37 PM IST

Actress Meena on Second Marriage: సీనియర్ నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ఆమె గతంలో మాట్లాడినా.. ఊహాగానాలు అలాగే వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు మీనా. రూమర్లపై ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.

Actress Meena: రెండో పెళ్లిపై మరోసారి స్పందించిన నటి మీనా.. రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు
Actress Meena: రెండో పెళ్లిపై మరోసారి స్పందించిన నటి మీనా.. రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు

Actress Meena: దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో నటి మీనా చాలా ఏళ్లపాటు స్టార్ హీరోయిన్‍గా వెలుగొందారు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‍గా చాలా చిత్రాలు చేశారు. తెలుగులో ఎక్కువ చిత్రాల్లో నటించిన మీనా.. తమిళం, కన్నడ, మలయాళంల్లోనూ సినిమాలు చేశారు. హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాల్లో మీనా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. అప్పుడప్పుడు టీవీ షోల్లోనూ కనిపిస్తున్నారు. అయితే, 2022లో మీనా జీవితంలో విషాదం జరిగింది. కాలేయ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె భర్త విద్యాసాగర్ మరణించారు.

భర్త విద్యాసాగర్ మరణించటంతో చాలా కాలం ఆ విషాదంలోనే ఉన్నారు మీనా. అయితే, కొంతకాలంగా మీనా గురించి రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. కోలీవుడ్ హీరో ధనుష్‍ను మీనా వివాహం చేసుకుంటారంటూ కొంతకాలం ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఓ బడా బిజినెస్‍మ్యాన్‍ను పెళ్లి చేసుకుంటారంటూ మరికొంతకాలం రూమర్లు వచ్చాయి.

రెండో పెళ్లి రూమర్లపై మీనా గతంలోనూ కొన్నిసార్లు స్పందించారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఇందుకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవడంతో దీనిపై మాట్లాడుతూ వచ్చారు. తాను రెండో పెళ్లి చేసుకోడం లేదని చెప్పారు. అయినా, సోషల్ మీడియాలో ఈ విషయంలో రూమర్లు ఏ మాత్రం ఆగడం లేదు. దీంతో మీనాకు విసుగు వచ్చేసింది. తాజాగా, ఓ యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త గట్టిగానే స్పందించారు మీనా. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇస్తూ.. వ్యాఖ్యలు చేశారు.

అబద్ధాలు వద్దు

సోషల్ మీడియా రోజురోజుకూ దారుణంగా తయారువుతోందని మీనా అన్నారు. అబద్దాలు వ్యాప్తి చేయవద్దని సూచించారు. “డబ్బులు వస్తాయంటే ఏమైనా రాసేస్తారా? సోషల్ మీడియాలో రానురాను దారుణంగా మారుతోంది. అబద్ధాలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎవరైనా.. ఏదైనా రాసే ముందు నిజాలు తెలుసుకోవాలి. ఆ తర్వాతే రాయాలి. అలా చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. నాలా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు దేశంలో చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి” అని మీనా అన్నారు.

ఏదైనా ఉంటే నేనే చెబుతా..

తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని మీనా మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో అలా ఏమైనా ఆలోచిస్తే తానే చెబుతానని అన్నారు. అప్పటి వరకు ఈ విషయంలో రూమర్లు వద్దని చెప్పారు. “రెండో వివాహం కోసం నేను ప్రస్తుతం ఏం ప్లాన్ చేసుకోవడం లేదు. భవిష్యత్తులో అది జరుగుతుందా లేదా అనేది కూడా తెలియదు. ఒకవేళ నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే.. నేను అధికారికంగా ప్రకటిస్తా. అప్పటి వరకు ఎలాంటి రూమర్లు సృష్టించకండి. ఎవరూ నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని మీనా అన్నారు.

మొత్తంగా తన రెండో పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై మీనా గట్టిగానే స్పందించారు. రెండో వివాహం ఆలోచన ప్రస్తుతానికి లేదని గట్టిగా చెప్పారు. మరి, ఇప్పటికైనా రూమర్లు ఆగుతాయేమో చూడాలి.

IPL_Entry_Point