Leader 2: లీడర్ 2పై శేఖర్ కమ్ముల క్లారిటీ.. సిద్ధాంతాలు, విలువలతో సినిమాలు తీస్తానంటూ!-sekhar kammula comments on happy days re release and leader 2 movie with rana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Leader 2: లీడర్ 2పై శేఖర్ కమ్ముల క్లారిటీ.. సిద్ధాంతాలు, విలువలతో సినిమాలు తీస్తానంటూ!

Leader 2: లీడర్ 2పై శేఖర్ కమ్ముల క్లారిటీ.. సిద్ధాంతాలు, విలువలతో సినిమాలు తీస్తానంటూ!

Sanjiv Kumar HT Telugu
Apr 19, 2024 08:43 AM IST

Sekhar Kammula About Happy Days Re Release: హ్యాపీ డేస్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఏప్రిల్ 19న హ్యాపీ డేస్ రీ రిలీజ్ సందర్భంగా లీడర్ 2, హ్యాపీ డేస్ 2 సినిమాలపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

లీడర్ 2పై శేఖర్ కమ్ముల క్లారిటీ.. సిద్ధాంతాలు, విలువలతో సినిమాలు తీస్తానంటూ!
లీడర్ 2పై శేఖర్ కమ్ముల క్లారిటీ.. సిద్ధాంతాలు, విలువలతో సినిమాలు తీస్తానంటూ!

Sekhar Kammula Clarity On Leader 2 Movie: నేషనల్అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల 2007లో డైరెక్ట్ చేసిన సినిమా హ్యపీడేస్. ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మళ్లీ ఏప్రిల్ 19న రీ రిలీజ్ కానుంది. అలాగే మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25 ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.

హ్యాపీడేస్ రీ రిలీజ్‌కు మీకు గుర్తుకు వచ్చిన సంఘటనలు ఉన్నాయా?

ఇన్నేళ్లు అయినా మళ్లీ మళ్లీ కాలేజీకి రావాలి. మళ్లీ మళ్లీ సినిమా చూడాలి అనిపించేలా ఆ సినిమా ఉంటుంది. సంగీతం కూడా అంత బాగుంటుంది. ఏదైనా ఔట్ డేట్ అవుతుందేమోనని నేను మొన్ననే మళ్లీ చూశాను. కానీ, చాలా ఫ్రెష్‌గా ఉంది. రీరిలీజ్ కూడా యూత్‌కు ఓ పండుగలా ఉంటుందనిపించింది. టైసన్ పాత్ర చాలా మ్యాజిక్‌గా ఉంటుంది.

హ్యాపీడేస్ సీక్వెల్‌గా ఏదైనా అనుకున్నారా.?

నాకు అనిపించింది. కానీ కథ ఫామ్ కాలేదు. హ్యాపీడేస్ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్లు అయింది. కానీ, ఇప్పటికీ చూసినా కరెక్టే అనిపించేలా ఉంది. స్టూడెంట్ బ్యాక్ గ్రౌండ్ అప్పటి పరిస్థితులరీత్యా కుదిరాయి. అయితే నేడు టెక్నాలజీ మారింది. సెల్ ఫోన్స్ ప్రతి స్టూడెంట్ చేతిలో ఉన్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచన విధానం తప్పకుండా మారుతుంది. టెక్నాలజీపరంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరి లోకంలో వారు ఉన్నారు.

25 సంవత్సరాల జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది?

సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్దాంతాలు పాటిస్తాను. చెడు చెప్పకూడదు అనే ఫార్మెట్‌లో పోతాను. నెగిటివ్ సంఘటనలు చాలా బెటర్‌గా చూపించవచ్చు అనిపిస్తుంది. నేను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదు. అలా అని సినిమాలూ తీయలేదు. అదే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు సినిమా రంగంలో పోకడ చాలా హార్ష్‌గా ఉంది.

లీడర్ కు సీక్వెల్ ఉంటుందా?

నాకు తీయాలని మైండ్‌లో ఉంది. కానీ సమయం కుదరడంలేదు. చేస్తే తప్పకుండా మళ్లీ రానా తోనే చేస్తా. అప్పట్లో ఆ సినిమాలో లక్ష కోట్లు అవినీతి అంటే చాలా ఎక్కవు అని అన్నారు. కానీ ఇప్పుడు మరింత దిగజారిపోయాయి. ఒక పర్సన్ గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా చెప్పాలి. ఇవన్నీ కుదరాలంటే కాస్త సమయం పడుతుంది.

రాజకీయాలు పాడైపోయినప్పుడు సినిమా తీయడానికి మరింత సబ్జెక్ట్‌లు ఉంటాయి కదా?

లీడర్‌లో ఏమి చేసినా చివరికి రియలైజ్ అవుతాడు. కానీ, ఇప్పుడు ఏది చెప్పాలన్నా దానికి సొల్యూషన్ లాజిక్‌గా చెప్పాలి. అందుకు చాలా టైం పడుతుంది. ఏదైనా సమస్య చెబితే దాని పరిష్కారం కూడా చెప్పగలగాలి. కథలు రాయవచ్చు. కానీ, మంచితనం సొల్యూషన్ అనేది చాలా కష్టంగా మారింది. మంచే గెలుస్తుంది. చెడు ఓడిపోతుంది. అనేది ప్రాక్టికల్‌గా చెప్పాలి.

ఏదైనా కొత్తవారితో చేయడం అనేది కూడా కథ ప్రకారమే.. ఇప్పుడు చేయబోయే కుబేర సినిమా కూడా ఈ పాత్రకు ఇతనే ఉండాలి అని రాసుకున్నదే. లీడర్ సినిమా రానాతోనే చేయాలి. కొత్తవారితో చేయాలని ట్రై చేస్తే దెబ్బతింటాం.

IPL_Entry_Point