Seetha Kalyana Vaibhogame Movie: 100 మంది ఫైటర్లు, 250 మంది డ్యాన్సర్స్.. ఆసక్తిగా సీతా కళ్యాణ వైభోగమే!-seetha kalyana vaibhogame movie first look released and high action fight with 100 fighters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Seetha Kalyana Vaibhogame Movie: 100 మంది ఫైటర్లు, 250 మంది డ్యాన్సర్స్.. ఆసక్తిగా సీతా కళ్యాణ వైభోగమే!

Seetha Kalyana Vaibhogame Movie: 100 మంది ఫైటర్లు, 250 మంది డ్యాన్సర్స్.. ఆసక్తిగా సీతా కళ్యాణ వైభోగమే!

Sanjiv Kumar HT Telugu
Published Apr 07, 2024 10:22 AM IST

Seetha Kalyana Vaibhogame Movie First Look: తెలుగులో మరో ఆసక్తికరమైన సినిమా రానుంది. సుమన్ తేజ్ హీరోగా నటిస్తోన్న మూవీ సీతా కళ్యాణ వైభోగమే. 100 మంది ఫైటర్లతో చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలెట్ అని మేకర్స్ చెబుతున్నారు.

సీతా కళ్యాణ వైభోగమే మూవీ ఫస్ట్ లుక్
సీతా కళ్యాణ వైభోగమే మూవీ ఫస్ట్ లుక్

Seetha Kalyana Vaibhogame Movie First Look: సినిమాల మీద ఆసక్తిని క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని సార్లు టైటిల్స్‌తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది. అలాంటి ఆసక్తికరమైన టైటిల్‌తో 'సీతా కళ్యాణ వైభోగమే' అనే చిత్రం రాబోతోంది. అసలే ఇప్పుడు దేశం అంతా కూడా జై శ్రీరామ్ అనే నినాదం మార్మోగిపోతోంది. ఈక్రమంలో వచ్చిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇక ఇప్పుడు సీతా కళ్యాణ వైభోగమే అంటూ రాబోతున్న ఈ సినిమా టైటిల్‌తోనే పాజిటివ్‌ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాచాలా యుగంధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ట్రెడిషనల్ వైబ్‌తో వస్తున్న ఈ మూవీకి సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రాబోతోంది.

గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఈ చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. లవ్ అండ్ యాక్షన్ మూవీని చూడబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 100 మంది ఫైటర్లతో చిత్రీకరించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయి.

ప్రస్తుతం సీతా కళ్యాణ వైభోగమే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో గగన్ విహారి విలన్‌గా నటిస్తున్నారు. వీరితోపాటు ఈ మూవీలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్‌గా పరుశురామ్, ఎడిటర్‌గా డి. వెంకట ప్రభు బాధ్యతలు చేపట్టారు.

భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఫైట్ మాస్టర్‌గా డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లుగా భాను మాస్టర్, పోలకి విజయ్ పని చేస్తున్నారు. ఈ సినిమాకు పని చేస్తున్న కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ టిల్లు స్క్వేర్ సినిమాకు పని చేశారు. ఇదిలా ఉంటే, సీతా కళ్యాణ వైభోగమే అనే పాట చాలా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. దాదాపుగా ప్రతి పెళ్లిలో ఈ పాట మారుమోగిపోతుంది. వివాహం అనగానే అందరికీ ఈ పాట గుర్తుకు వచ్చేస్తుంది.

ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న టైటిల్‌తో సినిమా వస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో హీరోయిన్‌ చేయి పట్టుకుని హీరో తీసుకెళ్లడం చూడొచ్చు. హీరో చేతిలో మండుతున్న కర్ర, కోపంతో చాలా ఇంటెన్సివ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు.

Whats_app_banner