Santosham OTT Awards: ఘనంగా సంతోషం ఓటీటీ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్‌‌గా ఆ హీరో.. విజేతల లిస్ట్ ఇదే!-second santosham ott awards 2023 winners list and details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Second Santosham Ott Awards 2023 Winners List And Details

Santosham OTT Awards: ఘనంగా సంతోషం ఓటీటీ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్‌‌గా ఆ హీరో.. విజేతల లిస్ట్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2023 02:13 PM IST

Santosham OTT Awards 2023 Winners: 22వ సంతోషం అవార్డ్స్ వేడుకలు గోవాలో జరగనున్న నేపథ్యంలో నవంబర్ 18న సంతోషం ఓటీటీ అవార్డ్స్అట్టహాసంగా జరిగాయి. 2వ సంతోషం ఓటీటీ అవార్డ్ వేడుకల్లో గెలిచిన నటీనటులు, సినిమాలు ఏంటో చూసేద్దాం.

సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023 విజేతల లిస్ట్
సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023 విజేతల లిస్ట్

2nd Santosham OTT Awards 2023 Winners: తెలుగులో ప్రతిష్టాత్మక అవార్డుల్లో సంతోషం అవార్డ్స్ ఒకటి. ప్రముఖ పాత్రికేయుడు సురేష్ కొండేటి అందిస్తున్న 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (Santosham South Indian Film Awards) గోవాలో డిసెంబర్ 2న నిర్వహించనున్నట్లు తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

అలాగే ఓటీటీ పేరుతో థియేటర్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రేక్షకుడి ఇంటికే వచ్చేసిన వినోదాన్ని కూడా సత్కరించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం "సంతోషం ఓటీటీ అవార్డ్స్‌" (Santosham OTT Awards) పేరుతో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలకు సైతం అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు సురేష్‌ కొండేటి.

డిసెంబర్ 2న గోవాలో సంతోషం అవార్డ్స్ (Santosham Film Awards 2023) నిర్వహించనున్న నేపథ్యంలో ఇటీవల 'సంతోషం ఓటీటీ అవార్డ్స్‌' రెండో సంవత్సర వేడుకల్ని శనివారం (నవంబర్ 18) హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు.

వైభవంగా సాగిన సంతోషం ఓటీటీ అవార్డ్స్ కార్యక్రమంలో మురళీమోహన్‌, జయసుధ, సంచలన రచయితలు విజయేంద్రప్రసాద్‌, సత్యానంద్‌, ఎస్‌.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, కె.యస్‌. రామారావు, జేడీ చక్రవర్తి, వేణు, నిరుపమ్‌, ఓంకార్‌, సుహాస్‌, అనసూయ, హంసానందిని, డింపుల్ హయాతి, జోష్‌ రవి, దర్శకులు వశిష్ట, సాయిరాజేష్‌, రేలంగి నరసింహారావు, నిర్మాతలు రాధామోహన్‌, వాసు, ఎస్‌కెఎన్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి. ప్రన్నకుమార్‌‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

యాంకర్ రవి, జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంతోషం ఓటీటీ అవార్డ్స్ కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలో దయ అనే వెబ్ సిరీస్‌కు గానూ హీరో, నటుడు జేడీ చక్రవర్తి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు. అలాగే క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్‌గా వేణు తొట్టెంపూడి అతిథి అనే సిరీస్‌కు అందుకున్నాడు.

సంతోషం ఓటీటీ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్:

1. బెస్ట్‌ మూవీ : ప్రేమ విమానం (నిర్మాత అభిషేక్‌ నామా)

2. బెస్ట్‌ యాక్టర్‌ : జె.డి. చక్రవర్తి (దయ)

3. క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ : వేణు తొట్టెంపూడి (అతిథి)

4. బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌ : ఓంకార్‌ (మ్యాన్షన్ 24)

5. బెస్ట్‌ డైరెక్టర్‌ : ఆనంద్‌ రంగా (వ్యవస్థ)

6. బెస్ట్‌ సపోర్టింగ్‌ డెబ్యూ ఆర్టిస్ట్‌ : శ్రీనివాస్‌ గారిరెడ్డి

7. బెస్ట్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ : జోష్‌ రవి (దయ)

8. బెస్ట్‌ సపోర్టింగ్‌ నటి : అనసూయ (ప్రేమ విమానం)

9. బెస్ట్‌ విలన్ : సుహాస్‌ (యాంగర్‌ టెయిల్స్‌)

10. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ : అనూప్‌ రూబెన్స్‌ (నిశానీ)

11. బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : వివేక్‌ కాలెపు (దయ)

12. బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ : అనిరుద్‌, దేవాన్ష్‌ (ప్రేమ విమానం)

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.