Thriller Movie: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-sci fi thriller movie aarambham is now on amazon prime video ott thriller movies on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thriller Movie: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Thriller Movie: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jul 05, 2024 07:56 PM IST

Thriller Movie: ఓటీటీలోకి తాజాగా ఓ మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Thriller Movie: ఓటీటీలోకి మరో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. కేరాఫ్ కంచరపాలెం మూవీతో పేరు సంపాదించిన మోహన్ భగత్ లీడ్ రోల్లో నటించిన ఆరంభం మూవీ థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. అజయ్ నాగ్ వి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సైలెంట్ గా ప్రైమ్ వీడియోలోకి రావడం విశేషం.

ఆరంభం ఓటీటీ స్ట్రీమింగ్

టైమ్ ట్రావెల్ తోపాటు గతంలో ఎన్నడూ చూడని అంశాలను మేళవించి తీసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఆరంభం. మే 10న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అయితే ఇప్పుడీ మూవీ శుక్రవారం (జులై 5) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడని వాళ్లు, ఈ జానర్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

ఆరంభం మూవీ జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీ చుట్టూ తిరుగుతుంది. అతడు అసలు జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడన్నది అంతుబట్టదు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్ లు వస్తారు. వాళ్ల విచారణలో కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగుచూస్తాయి. టైమ్ ట్రావెల్ మూవీస్ ఎప్పుడైనా మంచి థ్రిల్ అందిస్తాయి. ఈ ఆరంభం కూడా అలాంటిదే.

ఓ కన్నడ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మూవీ ట్రైలరే చాలా ఆసక్తి రేపింది. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ సెల్లో ఉన్న ఖైదీ ఎలా తప్పించుకున్నాడన్నదే మూవీ కథ. అక్కడ ఒక్క డైరీ మాత్రమే దొరుకుతుంది. ఆ డైరీలో ఏముందన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

ఆరంభం మూవీ గురించి..

ఆరంభం మూవీలో మోహన్ భగత్ తోపాటు సుప్రీత, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల నటించారు. ఏవీటీ ఎంటర్టైన్మెంట్ కింద అభిషేక్ వి తిరుమలేష్ మూవీని తెరకెక్కించాడు. మే 1న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటుడు రవీంద్ర విజయ్ మాట్లాడాడు.

"నవలను బేస్ చేసుకుని రూపొందించిన సినిమా ఇది. స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టిన సినిమాలు తప్పకుండా బాగుంటాయి. ఆరంభం సినిమాకు మా డైరెక్టర్ అజయ్ కథా కథనాల మీద అలాంటి గుడ్ వర్క్ చేశాడు. ఈ మూవీలో నేను డిటెక్టివ్ క్యారెక్టర్లో కనిపిస్తాను" అని అన్నాడు.

నిజానికి ఆరంభం మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఆడింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

WhatsApp channel