Ajith Trisha Sawadeeka: విడాముయర్చి నుంచి అజిత్, త్రిష ఫాస్ట్ బీట్ సాంగ్ సవదీక రిలీజ్ (వీడియో)-sawadeeka song released from ajith trisha starrer vidaamuyarchi movie composed by anirudh ravichandar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajith Trisha Sawadeeka: విడాముయర్చి నుంచి అజిత్, త్రిష ఫాస్ట్ బీట్ సాంగ్ సవదీక రిలీజ్ (వీడియో)

Ajith Trisha Sawadeeka: విడాముయర్చి నుంచి అజిత్, త్రిష ఫాస్ట్ బీట్ సాంగ్ సవదీక రిలీజ్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Dec 28, 2024 01:32 PM IST

Ajith Trisha Vidaamuyarchi Sawadeeka Song Release: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హీరోయిన్ త్రిష జంటగా నటించిన న్యూ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడాముయర్చి. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఫాస్ట్ బీట్ సాంగ్‌గా సవదీకను రిలీజ్ చేశారు మేకర్స్.

విడాముయర్చి నుంచి అజిత్, త్రిష ఫాస్ట్ బీట్ సాంగ్ సవదీక రిలీజ్ (వీడియో)
విడాముయర్చి నుంచి అజిత్, త్రిష ఫాస్ట్ బీట్ సాంగ్ సవదీక రిలీజ్ (వీడియో)

Ajith Trisha Vidaamuyarchi Sawadeeka Song Release: తమిళ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌ కుమార్‌ నటించిన మరో న్యూ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడాముయర్చి. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకు మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వహించారు.

yearly horoscope entry point

అజిత్‌కు జోడీగా త్రిష

తమిళంలో ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. అలాగే, విడాముయర్చి సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, ఆర‌వ్‌, రెజీనా కసాండ్ర, నిఖిల్ నాయ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఈ సినిమా వ‌చ్చే 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

అదిరిపోయిన విడాముయర్చి టీజర్

విడాముయర్చి అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై భారీ అంచ‌నాల‌ు పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, వారికోసం స్పెషల్ ట్రీట్ ఇస్తూ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా విడుద‌ల చేసిన విడాముయ‌ర్చి టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

సవదీక ఫాస్ట్ బీట్ సాంగ్ రిలీజ్

దాంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లేలా విడాముయర్చి నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘స‌వదీక‌’ అనే ఫాస్ట్ బీట్ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం (డిసెంబర్ 27) రోజున విడుద‌ల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న సంగతి తెలిసిందే.

రొమాంటిక్ సీన్స్

అనిరుద్ ర‌విచంద‌ర్ త‌న‌దైన శైలిలో మ‌రో సూప‌ర్బ్ ట్యూన్‌తో స‌వ‌దీక సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఆంథోని దాస‌న్ పాడిన ఈ పాట‌ను అరివు రాశారు. అజిత్, త్రిష కలిసి డ్యాన్స్ చేయడం, వారి మధ్య రొమాంటిక్‌ సీన్లతో ఈ పాట సాగునుందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ చిత్రాలు

ఇక స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను, వైవిధ్య‌మైన చిత్రాల‌తో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జీకేఎం త‌మిళ్ కుమ‌ర‌న్ నేతృత్వంలో సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

టెక్నికల్ టీమ్

ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్‌), గోపీ ప్ర‌స‌న్న (ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌), హ‌రిహ‌ర‌సుత‌న్‌ (వి.ఎఫ్‌.ఎక్స్‌), సురేష్ చంద్ర (పి.ఆర్‌.ఒ-త‌మిళ్), నాయుడు సురేంద్ర‌ కుమార్‌ - ఫ‌ణి కందుకూరి (పి.ఆర్.ఒ - తెలుగు) సినిమాలో భాగ‌మయ్యారు.

Whats_app_banner