Satyam Sundaram TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ..-satyam sundram tv premiere date karthi aravind swamy movie to telecast on star maa on this sunday 9th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyam Sundaram Tv Premiere: టీవీలోకి వచ్చేస్తున్న కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ..

Satyam Sundaram TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ..

Hari Prasad S HT Telugu
Feb 03, 2025 05:37 PM IST

Satyam Sundaram TV Premiere: తమిళంతోపాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయిన మూవీ సత్యం సుందరం. ఇప్పుడు టీవీలోకి కూడా వస్తోంది. కార్తీ, అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా థియేటర్లలో, తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది.

టీవీలోకి వచ్చేస్తున్న కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ..
టీవీలోకి వచ్చేస్తున్న కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ..

Satyam Sundaram TV Premiere: తమిళ ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ మేయళగన్. తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజైంది. అక్కడా, ఇక్కడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. నాలుగు నెలల తర్వాత టీవీలోకి వస్తోంది. ఈ సత్యం సుందరం సినిమాను స్టార్ మా ఛానెల్ టెలికాస్ట్ చేయబోతోంది.

సత్యం సుందరం టీవీ ప్రీమియర్ డేట్

ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరినీ ఎమోషనల్ గా మార్చేసిన మూవీ సత్యం సుందరం. 96 మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 9) సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది.

ఈ విషయాన్ని ఆ ఛానెల్ సోమవారం (ఫిబ్రవరి 3) వెల్లడించింది. "సత్యం సుందరం.. కుటుంబం, గ్రామీణ జీవితం, మరచిపోలేని బంధాల ద్వారా సాగే ఓ అందమైన మనసుకు హత్తుకునే ప్రయాణం. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ స్టార్ మాలో" అంటూ ఆ ఛానెల్ ట్వీట్ చేసింది.

బాక్సాఫీస్ పరంగా మరీ అంతపెద్దగా వసూళ్లు రాకపోయినా.. కుటుంబ ప్రేక్షకులను సినిమా బాగా ఆకట్టుకుంది. రూ.35 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. రూ.45 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

సత్యం సుందరం మూవీ కథ ఇదీ..

స్వార్థంతో నిండిపోయిన ఇప్పటి ప్రపంచంలో ఎదుటివారి మేలు కోరుకునే వాళ్లు చాలా అరుదు. అలాంటి ఓ వ్యక్తి కథే ఈ సత్యం సుందరం. ఈకాలం రెగ్యులర్ కమర్షియల్ సినిమా హంగులకు దూరంగా, మొత్తం కుటుంబం అంతా హాయిగా కూర్చొని చూడాల్సిన మూవీ ఇది.

సత్యం (అరవింద్ స్వామి), సుందరం (కార్తీ) కలిసి సాగించిన ఓ ఎమోషనల్ జర్నీయే ఈ మూవీ. ఎలాంటి సాయం ఆశించ‌కుండా మ‌న మంచికోరుకునేవారు కూడా సొసైటీలో చాలా మంది ఉంటార‌ని ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరు బాగుంది. ఈ పాయింట్‌ను చాలా నాచుర‌ల్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస‌య్యాడు. సినిమా చూస్తున్న‌ట్లుగా కాకుండా నిజ‌మైన జీవితాల్ని తెర‌పై చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది.

కార్తి, అర‌వింద్ స్వామి పాత్ర‌ల్లో ఆడియెన్స్‌ త‌మ‌ను తాము చూసుకునేలా చూసుకుంటూ ఉద్వేగానికి లోన‌య్యేలా చేశారు. ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ సినిమాను ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే మాత్రం వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 9) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో తప్పకుండా చూడండి.

Whats_app_banner