Satyam Rajesh: సత్యం రాజేష్ హీరోగా మరొ కొత్త సినిమా.. పొలిమేర 2కి ముందే రిలీజ్!-satyam rajesh tenant movie title glimpse released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyam Rajesh: సత్యం రాజేష్ హీరోగా మరొ కొత్త సినిమా.. పొలిమేర 2కి ముందే రిలీజ్!

Satyam Rajesh: సత్యం రాజేష్ హీరోగా మరొ కొత్త సినిమా.. పొలిమేర 2కి ముందే రిలీజ్!

Sanjiv Kumar HT Telugu
Oct 29, 2023 08:10 AM IST

Satyam Rajesh Tenant Movie: మా ఊరి పొలిమేర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్ మా ఊరి పొలిమేర 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీకి ముందే మరో కొత్త సినిమాను టెనెంట్‌ను ప్రకటించాడు సత్యం రాజేష్.

సత్యం రాజేష్ టెనెంట్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల
సత్యం రాజేష్ టెనెంట్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల

Tenant Title Glimpse: కమెడియన్‌గా, నటుడిగా అందివచ్చిన అవకాశాలతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు సత్యం రాజేష్. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘మా ఊరి పొలిమేర -2’ చిత్రం ఈ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీనికి కంటే ముందుగానే తాజాగా సత్యం రాజేష్ నటించిన మరో చిత్రం ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ ‘టెనెంట్’ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని మేకర్స్ అంటున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో వచ్చిన ‘అద్భుతం’ చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి టెనెంట్ మూవీని నిర్మించారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ మూవీ డైరెక్టర్ వై. యుగంధర్ టెనెంట్ సినిమాకు దర్శకత్వం వహించారు.

అంతేకాకుండా, స్క్రీన్ ప్లే, సంభాషణల్ని కూడా అందించారు వై. యుగంధర్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. టెనెంట్ సినిమాలో సత్యం రాజేష్‌తోపాటు ఎస్తేర్ నొరోన్హా, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు నటించారు. ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Whats_app_banner