Crime Thriller OTT: ఓటీటీలోకి టాలీవుడ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
Crime Thriller OTT: సత్యదేవ్ హీరోగా నటించిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జీబ్రా ఓటీటీలోకి వస్తోన్నట్లు సమాచారం. డిసెంబర్ మూడో వారం నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. జీబ్రాలో పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ్ మరో హీరోగా కనిపించాడు.
Crime Thriller OTT: టాలీవుడ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జీబ్రా ఈ నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది. సత్యదేవ్, డాలీ ధనుంజయ్ (పుష్ప ఫేమ్) హీరోలుగా నటించిన ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్లుగా కనిపించారు. సత్య రాజ్ కీలక పాత్ర లో నటించాడు.
ఆహా ఓటీటీలో...
జీబ్రా మూవీ డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నెల మూడో వారం నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. డిసెంబర్20న జీబ్రా ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే జీబ్రా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
మౌత్ టాక్‌తో...
నవంబర్ నెలాఖరున థియేటర్లలో రిలీజైన జీబ్రా మూవీ ఫస్ట్ వీక్ మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో, మౌత్‌టాక్‌తో మెళ్లగా వసూళ్లు పెరిగాయి. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది.
ఈ మూవీతో చాలా రోజుల తర్వాత కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సత్యదేవ్. జీబ్రా కాన్సెప్ట్‌తో పాటు సత్యదేవ్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చాయి. జీబ్రా మూవీకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.
జీబ్రా కథ ఇదే...
సూర్య (సత్యదేవ్) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తుంటాడు. తన బ్యాంకులోనే పనిచేసే స్వాతిని (ప్రియా భవానీ శంకర్) ఇష్టపడతాడు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. ఓ వ్యక్తి ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును మరొకరి అకౌంట్‌లో వేస్తుంది స్వాతి. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపలను అడ్డుపెట్టుకొని డబ్బులు పొగొట్టుకున్న కస్టమర్‌కు స్వాతి తరఫున చెల్లిస్తాడు సూర్య.
అదే టైమ్‌లో సూర్య అకౌంట్‌లో ఐదు కోట్లు పడతాయి. ఆ ఐదు కోట్లు ఎక్కడివి? అదే తన డబ్బే అంటూ గ్యాంగ్ స్టర్ ఆది ( డాలీ ధనుంజయ్)...సూర్యను ఎందుకు బెదిరించాడు? అకౌంట్ ఫ్రీజ్ కావడంతో ఆ డబ్బును ఆదికి సూర్య ఎలా చెల్లించాడు? ఈ పోరాటంలో ఆది, సూర్యలలో ఎవరు గెలిచారు? అనే అంశాలతో దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ జీబ్రా మూవీని తెరకెక్కించాడు.
లక్ మాత్రం కలిసిరావడం లేదు...
టాలెంట్‌తో పాటు అవకాశాలు వరిస్తోన్న సత్యదేవ్‌కు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. జీబ్రా కంటే ముందు అతడు హీరోగా నటించిన కృష్ణమ్మ, గాడ్సే, గుర్తుందా శీతాకాలం సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సత్యదేవ్ విలన్‌గా నటించాడు.
మలయాళం మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అక్షయ్‌కుమార్ రామసేతులో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ కూడా అతడికి హిట్టును అందివ్వలేకపోయింది.