Sarkaar Episode 12 Promo: సుధీర్ నావాడంటే నావాడంటున్న మేఘన, సౌందర్య.. నలుగురమ్మాయిలతో మరోసారి సుడిగాలి సరసాలు-sarkaar episode 12 promo sudigali sudheer romantic moments meghana lokesh soundarya pooja varsha aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaar Episode 12 Promo: సుధీర్ నావాడంటే నావాడంటున్న మేఘన, సౌందర్య.. నలుగురమ్మాయిలతో మరోసారి సుడిగాలి సరసాలు

Sarkaar Episode 12 Promo: సుధీర్ నావాడంటే నావాడంటున్న మేఘన, సౌందర్య.. నలుగురమ్మాయిలతో మరోసారి సుడిగాలి సరసాలు

Hari Prasad S HT Telugu
Jul 01, 2024 05:42 PM IST

Sarkaar Episode 12 Promo: సుధీర్ నావాడంటే నావాడంటూ ఇద్దరమ్మాయిలు పోటీ పడ్డారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు మేఘనా లోకేష్, సౌందర్య. ఇక మరో ఇద్దరు అమ్మాయిలు వర్ష, పూజలతోనూ మన సుడిగాలి బాగానే సరసాలాడాడు.

సుధీర్ నావాడంటే నావాడంటున్న మేఘన, సౌందర్య.. నలుగురమ్మాయిలతో మరోసారి సుడిగాలి సరసాలు
సుధీర్ నావాడంటే నావాడంటున్న మేఘన, సౌందర్య.. నలుగురమ్మాయిలతో మరోసారి సుడిగాలి సరసాలు

Sarkaar Episode 12 Promo: ఆహా ఓటీటీలో ప్రతి వారం వచ్చే సర్కార్ గేమ్ షో 12వ ఎపిసోడ్ ప్రోమోను సోమవారం (జులై 1) రిలీజ్ చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ మరోసారి నలుగురు అమ్మాయిలతో సరసాలాడాడు. అందులో ఇద్దరైతే సుధీర్ నా వాడంటే నా వాడంటూ పోటీ పడ్డారు. దీంతో మూడు నిమిషాలకుపైగా ఉన్న ఈ ప్రోమో అంతా సరదాగా సాగిపోయింది.

yearly horoscope entry point

సర్కార్ ఎపిసోడ్ 12 ప్రోమో

సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో హోస్ట్ చేస్తున్న గేమ్ షో సర్కార్ నాలుగో సీజన్ 12వ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ కొత్త ఎపిసోడ్ రాబోయే శుక్రవారం (జులై 5) రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్లో సుధీర్ నలుగురు అమ్మాయిలు మేఘనా ఆకాశ్, సౌందర్య, పూజ, వర్షలతో గేమ్ ఆడాడు. ప్రతి ఎపిసోడ్ లాగా వచ్చిన గెస్టులు అతనిపై పంచ్ లేస్తూ వెళ్లారు.

ఈ ఎపిసోడ్ ప్రోమోలో మొదట మేఘనా లోకేశ్, సౌందర్య వచ్చారు. వాళ్లు వచ్చీ రాగానే సుధీర్ నావాడంటే నావాడంటూ అతన్ని అటూ ఇటూ లాగారు. ఆ తర్వాత మీరు శ్రీకాకుళం వెళ్లారా.. మరి అక్కడ పులి తిరుగుతుందని రాశారు అంటూ సుధీర్ పై మేఘన ఓ పంచ్ వేసింది. వాళ్లు అతన్ని అలా అటూఇటూ లాగుతుండగానే బ్యాక్ గ్రౌండ్ లో నుంచి కట్ కట్ అనే వాయిస్ వస్తుంది.

చెప్పాను కదా రేపు ఈ సీన్ అయిపోతుంది అని సౌందర్య అంటుంది. ఏంటి రేపటి షూటింగ్ కోసం చేసే సీనా ఇది అని సుధీర్ తెల్లమొహం వేస్తాడు. ఇక ఆ తర్వాత పూజా, వర్ష వస్తారు. వాళ్లు కూడా అతన్ని అలాగే పొగుడుతుంటే అదంతా ఉత్తదే అనుకుంటాడు. కానీ నిజంగా పొగుడుతున్నారని తెలిసి మరోసారి బకరా అవుతాడు.

ఇక అసలు గేమ్ లోనూ ఈ నలుగురు అమ్మాయిలతో సుధీర్ సరసాలాడుతూ సరదాగా ఈ ఎపిసోడ్ ను హోస్ట్ చేసినట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ 12వ ఎపిసోడ్ శుక్రవారం (జులై 5) రాత్రి 8 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఆహా ఓటీటీ షోలు

ఆహా ఓటీటీ కొత్త తెలుగు సినిమాలతోపాటు ఎన్నో ఒరిజినల్స్, గేమ్ షోలను కూడా ప్రేక్షకులకు అందిస్తోంది. అందులో భాగంగానే ఈ సర్కార్ గేమ్ షోను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. నాలుగో సీజన్లోనూ 11 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఈ నాలుగో సీజన్ కు హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ఉండటంతో ఇది మరో లెవల్ కు వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఆహా ఓటీటీ టాప్ షోలలో ఈ సర్కార్ తొలి స్థానంలో కొనసాగుతోంది. వచ్చిన గెస్టులతో సుధీర్ సరదాగా చేసే కామెడీ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక బెట్ వేసి ఆడే గేమ్ కూడా ఆసక్తికరంగా ఉంటోంది. మరి మరో నాలుగు రోజుల్లో వస్తున్న ఈ సర్కార్ కొత్త ఎపిసోడ్ ను చూసి ఎంజాయ్ చేసేయండి.

Whats_app_banner