Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ ఖరారు-saripodhaa sanivaaram trailer release date confirmed nani vivek athreya sj surya movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ ఖరారు

Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ ఖరారు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 10, 2024 07:30 PM IST

Saripodhaa Sanivaaram Trailer date: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్‍కు రెండు వారాల ముందే ట్రైలర్ వచ్చేస్తోంది.

Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ ఖరారు
Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ ఖరారు

సరిపోదా శనివారం సినిమాపై హైప్ భారీ స్థాయిలో ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. ఇటీవలే వచ్చిన ఓ గ్లింప్స్ విపరీతంగా పాపులర్ అయింది. అందరికీ తెగనచ్చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సరిపోదా శనివారం ట్రైలర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తోంది. ట్రైలర్ డేట్‍ను కూడా వెల్లడించింది.

ట్రైలర్ రిలీజ్ తేదీ ఇదే

సరిపోదా శనివారం ట్రైలర్ ఆగస్టు 13వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఆగస్టు 10) అధికారికంగా వెల్లడించింది. "సోకులపాలెం జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎంతో ఎగ్జైట్ చేసే సరిపోదా శనివారం ట్రైలర్ ఆగస్టు 13న తీసుకొస్తున్నాం” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది. జనాలు గోడవైపు ఆసక్తిగా చూస్తుండగా.. అది కాస్త చీలి ట్రైలర్ ఆగస్టు 13న వస్తుందనే వీడియోను కూడా పోస్ట్ చేసింది.

సరిపోదా శనివారం సినిమాలో సూర్య అనే క్యారెక్టర్ చేశారు నాని. శనివారం మాత్రమే కోపం చూపించే హీరో కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వస్తోంది. ఈ పాయింట్‍పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఎస్‍జే సూర్య విలన్‍ పాత్ర పోషించారు.

ఎస్‍జే సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే సరిపోదా శనివారం నుంచి నాట్ ఏ టీజర్ అంటూ గ్లింప్స్ వచ్చింది. దీనికి అదిరే రెస్పాన్స్ వచ్చింది. అక్రమాలు చేసే పోలీస్ ఆఫీసర్ ఎస్‍జే సూర్యను నాని, ప్రియాంక ఎదుర్కొంటారనేలా ఈ గ్లింప్స్ ఉంది. ఈ వీడియోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ చాలా పాపులర్ అయింది. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

ఐదు భాషల్లో రిలీజ్

సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానుంది. తెలుగు మినహా ఇతర నాలుగు భాషల్లో సూర్యాస్ సాటర్‌డే పేరుతో వస్తోంది. ఆగస్టు 13వ తేదీన ఐదు భాషల్లో ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది.

నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్లలో గతంలో వచ్చిన అంటే సుందరానికి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్‍గా పెద్ద హిట్ కాకపోయినా.. ప్రశంసలు దక్కించుకుంది. నాని యాక్టింగ్, వివేక్ ఆత్రేయ టేకింగ్‍ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబో సరిపోదా శనివారంతో రిపీట్ అవుతోంది. అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీలో నాని, ప్రియాంక, ఎస్‍జే సూర్యతో పాటు అభిరామి, అదితి బాలన్, సాయికుమార్, మురళీ శర్మ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.