Saripodhaa Sanivaaram first single: నాని సరిపోదా శనివారం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
Saripodhaa Sanivaaram first single: నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గరమ్ గరమ్ సాంగ్ వచ్చేసింది. శనివారం (జూన్ 15) మేకర్స్ ఈ సాంగ్ రిలీజ్ చేశారు.
Saripodhaa Sanivaaram first single: నేచురల్ స్టార్ నాని మరో వెరైటీ టైటిల్ తో వస్తున్న మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ ఆగస్ట్ 29న రిలీజ్ కానుండగా.. తాజాగా శనివారం (జూన్ 15) నాడే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం విశేషం. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్
నాని సరిపోదా శనివారం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గరం గరం యముడయో అంటూ సాగిన ఈ పాట ఓ డిఫరెంట్ ఫీల్ అందించింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ వాయిస్ తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ పాటలో నాని రగ్గ్‌డ్ లుక్ లో అక్కడక్కడా కనిపించాడు.
గతంలో నానితో కలిసి అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయనే మరోసారి ఓ డిఫరెంట్ టైటిల్, స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలో నానిని పూర్తి క్లాస్ లుక్ లో చూపించగా.. ఈ మూవీలో క్లాస్, మాస్ కలగలసిన లుక్ తో తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
గరం గరం యముడయో.. శివమెత్తే శివుడయో.. నరం నరం బిగువయో అంటూ మూవీలో హీరో పాత్రను వర్ణిస్తూ సాగిపోయిందీ పాట. ఈ ఫస్ట్ సింగిల్ ద్వారానే తన మూవీ థీమ్ ఎలాంటిదో డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఎస్‌జే సూర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
నాని డిఫరెంట్ మూవీస్
గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్స్ అందుకున్న నాని.. ఇప్పుడీ సరిపోదా శనివారంపైనా భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్, పవన్ కల్యాణ్ ఓటీ సినిమాలను నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమానూ నిర్మిస్తోంది. చాలా రోజుల కిందటే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాని, సూర్యలను చాలా పవర్‌ఫుల్ గా చూపించారు.
నాని ఈ మధ్య కాలంలో భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. దసరాలాంటి ఓ మాస్ మసాలా సినిమా తర్వాత హాయ్ నాన్నలాంటి ఫ్యామిలీ ఆడియెన్స్ మూవీతో వచ్చాడు. ఇక ఇప్పుడు సరిపోదా శనివారం మూవీలో మరోసారి కాస్త మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత సాహో, ఓజీ ఫేమ్ సుజీత్ తో ఓ యాక్షన్ డ్రామా, బలగం ఫేమ్ వేణు యెల్దండితో మరో ఫ్యామిలీ డ్రామా తీయబోతున్నాడు.
సరిపోదా శనివారం మూవీ ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. నాని, వివేక్ కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మరి ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి.