Saripodhaa Sanivaaram: ఓటీటీ రిలీజ్‍కు ముందు సరిపోదా శనివారం నుంచి డిలీటెడ్ సీన్స్ వీడియో వచ్చేసింది: చూసేయండి-saripodhaa sanivaaram deleted scenes released on youtube ahead of ott streaming on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram: ఓటీటీ రిలీజ్‍కు ముందు సరిపోదా శనివారం నుంచి డిలీటెడ్ సీన్స్ వీడియో వచ్చేసింది: చూసేయండి

Saripodhaa Sanivaaram: ఓటీటీ రిలీజ్‍కు ముందు సరిపోదా శనివారం నుంచి డిలీటెడ్ సీన్స్ వీడియో వచ్చేసింది: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 22, 2024 05:42 PM IST

Saripodhaa Sanivaaram Deleted Scenes: సరిపోదా శనివారం సినిమా నుంచి డీలెడ్ సీన్లను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్‍కు సమీపిస్తున్న వేళ యూట్యూబ్‍లో ఈ సీన్లను తెచ్చింది. నాని, ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్యతో ఈ సీన్లు ఉన్నాయి.

Saripodhaa Sanivaaram: ఓటీటీ రిలీజ్‍కు ముందు సరిపోదా శనివారం నుంచి డిలీటెడ్ సీన్స్ వీడియో వచ్చేసింది: చూసేయండి
Saripodhaa Sanivaaram: ఓటీటీ రిలీజ్‍కు ముందు సరిపోదా శనివారం నుంచి డిలీటెడ్ సీన్స్ వీడియో వచ్చేసింది: చూసేయండి

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. పాజిటివ్ టాక్‍తో అదిరే కలెక్షన్లను దక్కించుకుంది. ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచి కలెక్షన్ల మోత మోగించింది. ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. థియేటర్లలో అదరగొట్టిన సరిపోదా శనివారం నెల ముగియక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందు ఈ చిత్రం నుంచి డిలీటెడ్ సీన్‍లను మూవీ టీమ్ తీసుకొచ్చింది.

డిలీటెడ్ సీన్స్ ఇలా..

సరిపోదా శనివారం చిత్రం థియేటర్ వెర్షన్‍లో డిలీట్ చేసిన సీన్‍లను వీడియోగా మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 22) తీసుకొచ్చింది. డిలీటెడ్ సీన్-1 అంటూ యూట్యూబ్‍లో వీడియో అందుబాటులోకి తెచ్చింది డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్. హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ మధ్య తొలి సీన్ ఉంది. ఇద్దరూ హోటల్‍లో టీ తాగుతుంటే.. కొందరు ఫోన్‍లో ప్రియాంకను ఫొటో తీస్తారు. దీంతో వారితో గొడవకు ప్రియాంక దిగుతారు.

గొడవ అంటే భయమున్నట్టుగా ప్రియాంకను వారి నుంచి దూరంగా పక్కకు తీసుకెళతారు నాని. ఆ తర్వాత వారి బండి తాళాన్ని డ్రైనేజీలో పడేస్తానని బెదిరిస్తారు. క్యూట్ స్మైల్ ఇస్తారు ప్రియాంక.

ఈ వీడియోలో మరో సీన్ కూడా ఉంది. పోలీస్ స్టేషన్‍ సెల్‍లో ఉన్న ఖైదీని ఎస్‍జే సూర్య కొట్టకుండా ఉండేందుకు తాళాన్ని రాయితో కొట్టి చెడగొడతారు ప్రియాంక. దీంతో తాళం తెరుచుకోక ఖైదీని కొట్టేందుకు ఎస్‍జే సూర్య తిప్పలు పడతారు. ఫ్రస్ట్రేషన్‍తో కుర్చీని విరగ్గొడతారు.

థియేట్రికల్ వెర్షన్‍లో డిలీట్ చేయాలనుకున్న సీన్లు కావటంతో వీటికి ఫైనల్ డబ్బింగ్ వెర్షన్‍ను సరిపోదా శనివారం మూవీ టీమ్ సిద్ధం చేయలేదని తెలుస్తోంది. అందుకే డిలీటెడ్ సీన్స్ వీడియోలో డైలాగ్‍లు లేకుండా మ్యూజిక్‍తోనే బ్యాక్‍గ్రౌండ్ ఉంది. దీంట్లోనూ ఎస్‍జే సూర్య సీన్ హైలైట్ అయింది. డిలీటెడ్ సీన్-1 అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ ఈ వీడియోను తేవటంతో.. మరిన్ని సీన్లను కూడా తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్

సరిపోదా శనివారం చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ గురువారమే సెప్టెంబర్ 26వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్‍లో వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ ఒకేసారి ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది. రూ.100 కోట్ల కలెక్షన్లతో థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయినా.. నెలలోపే సెప్టెంబర్ 26న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ మూవీ వస్తోంది.

సరిపోదా శనివారం చిత్రంలో నాని, ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్యతో పాటు సాయి కుమార్, అజయ్ ఘోష్, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఎస్‍జే సూర్య నటనకు ఎక్కువ ప్రశంసలు దక్కాయి. అంటే సుందరానికి తర్వాత సరిపోదా శనివారంతో నాని - వివేక్ కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఈసారి భారీ సక్సెస్ సాధించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద బలంగా అయింది.