Saravanan The Legend OTT Streaming: శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నేడు) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా రిలీజైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ది లెజెండ్ స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది.
గత ఏడాది జూలై 28న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో రిలీజైన ఏడు నెలలకు ది లెజెండ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో దర్శకద్వయం జేడీ జెర్రీఈ సినిమాను తెరకెక్కించారు.
తమిళనాడులోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన శరవణన్ ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతడికి జోడీగా ఇందులో ఊర్వశి రౌటేలా హీరోయిన్‌గా నటించింది. గీతికా తివారీ మరో నాయికగా కనిపించింది. రాయ్ లక్ష్మి ప్రత్యేక గీతంలో నటించింది. తమిళంతో పాటు తెలుగులో ఒకే రోజు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో ఈసినిమా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
శరవణన్ యాక్టింగ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్, మీమ్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇందులో శరవణన్ సైంటిస్ట్ పాత్రలో నటించాడు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల కోసం మెడిసిన్ కనిపెట్టిన ఓ సైంటిస్ట్‌కు కార్పొరేట్ మాఫియా ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ సమస్యల్ని ఎదురించి అతడు ఎలా పోరాడాడన్నదే ఈ సినిమా ది లెజెండ్ సినిమా కథ.