Paramporul Review: పరంపోరుల్ రివ్యూ.. వెయ్యేళ్ల చరిత్రగల విగ్రహంతో వ్యాపారం.. ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?-sarathkumar amitash pradhan paramporul movie review in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Paramporul Review: పరంపోరుల్ రివ్యూ.. వెయ్యేళ్ల చరిత్రగల విగ్రహంతో వ్యాపారం.. ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Paramporul Review: పరంపోరుల్ రివ్యూ.. వెయ్యేళ్ల చరిత్రగల విగ్రహంతో వ్యాపారం.. ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 12, 2024 05:30 AM IST

Paramporul Review In Telugu: గతేడాది తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా పరంపోరుల్. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలై సుమారు రూ. 15 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించిన పరంపోరుల్ ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న పరంపోరుల్ రివ్యూలోకి వెళితే..

పరంపోరుల్ రివ్యూ.. అదిరిపోయే ట్విస్టులతో ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
పరంపోరుల్ రివ్యూ.. అదిరిపోయే ట్విస్టులతో ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Paramporul Movie Review Telugu: శరత్ కుమార్, అమితాష్ ప్రధాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పరంపోరుల్. కవి క్రియేషన్స్ బ్యానర్‌పై మనోజ్ గిరీష్ నిర్మించిన పరంపోరుల్ సినిమాకు సి. అరవింద్ రాజ్ కథ, దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కశ్మీరా పరదేశి నటించగా.. బాలాజీ శక్తివేల్, టి శివ విన్సెంట్ అశోకన్ కీలక పాత్రలు పోషించారు.

yearly horoscope entry point

2023లో సుమారు రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన పరంపోరుల్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 15 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. కథా, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ ప్లేతో ఆకట్టుకునేవిధంగా తెరకెక్కిన పరంపోరుల్ మూవీ అంచనాలకు మించి మంచి హిట్ కొట్టింది. ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవి విన్‌లో ఫిబ్రవరి 1 నుంచి పరంపోరుల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా నిజంగా ఆకట్టుకుందా లేదా అనేది పరంపోరుల్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

గౌరీ (అమితాష్ ప్రధాన్)కు అమ్మనాన్న, చెల్లి ఉంటారు. చెల్లి శక్తికి జీర్ణ సంబధిత వ్యాధితో బాధపడుతుంది. దాని చికిత్సకు సుమారు రూ. 40 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకోసం తాను పనిచేసిన సరుగుణ్ ఇంటితోపాటు పలు ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఎస్సై మైత్రేయన్ (శరత్ కుమార్) ఇంట్లో దొంగతనం చేస్తాడు. కానీ, అవినితి పోలీసు అధికారి అయిన మైత్రేయన్‌కు గౌరీ దొరికిపోతాడు. అప్పుడే విగ్రహాలు విక్రయించే సరుగుణ్ దగ్గర గౌరీ పని చేశాడని తెలుసుకుంటాడు. దాంతో అతనితో ఒక డీల్ కుదుర్చుకుంటాడు మైత్రేయన్.

మూవీ హైలెట్స్

చెల్లెలి కోసం మైత్రేయన్‌తో చేతులు కలుపుతాడు గౌరీ. అయితే గౌరీతో మైత్రేయన్ కుదుర్చుకున్న డీల్ ఏంటీ? నాగపట్నంకు చెందిన విగ్రహం విశిష్టత, దాని విలువ ఎంత? అది ఎలా దొరికింది? ఆ విగ్రహాన్ని అమ్మే క్రమంలో మైత్రేయన్, గౌరి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అందుకు ఎవరెవరి సహాయం తీసుకున్నారు? మరి ఆ విగ్రహాన్ని అమ్మగలిగారా? గౌరీ తన చెల్లెలిని కాపాడుకున్నాడా? మైత్రేయన్ పరిస్థితి ఏమైంది? అనే తదితర ఆసక్తికర విషయాలతో సాగిన సినిమానే పరంపోరుల్.

విశ్లేషణ:

పరంపోరుల్ అంటే చాలా శక్తివంతమైనది అని అర్థం. టైటిల్‌కు తగినట్లుగానే వెయ్యేళ్ల చరిత్ర ఉన్న విగ్రహం చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. దీనికి ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఎంగేజ్ చేస్తూ సినిమా సాగుతుంది. నాగపట్నంలో ఓ రైతుకు పొలంలో విగ్రహం దొరకడంతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సీన్‌తో ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సినిమా సాగుతూ ఉంటుంది. విగ్రహాన్ని కొనేందుకు వ్యాపారులు రావడం, అతన్ని చంపి విగ్రహం తీసుకోవడం ఊహించని ట్విస్టులతో పరంపోరుల్ ఆద్యంతం ఆకట్టుకుంది.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

వేయ్యేళ్ల చరిత్ర ఉన్న విగ్రహం ఎస్సై మైత్రేయర్, గౌరీలకు దొరకడం. దాన్ని అమ్మేందుకు శతవిధాలా వారిద్దరు ప్రయత్నించడం, ఈ క్రమంలో ఒకరిపై మరొకరికి అనుమానం రావడం, విగ్రహ చరిత్ర తెలుసుకునేందుకు మైత్రేయర్ భార్య చెల్లెలి సహాయం తీసుకోవడం, మైత్రేయర్ ఫ్యామిలీ, గౌరీ కుటుంబ సమస్యలు ఇలా ఒక్కో అంశంతో గ్రిప్పింగ్‌గా స్క్రీన్ ప్లే ఉంటుంది. అయితే కొన్నిసార్లు కథ ఎటు వెళ్తుంది అనేది ఊహించేవిధంగా ఉంది.

చాలా ఇంట్రెస్టింట్‌గా

విగ్రహ అక్రమ రవాణాకు ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాను జోడించి ఎంగేజింగ్ సన్నివేశాలతో పరంపోరుల్ సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ అరవింద్ రాజ్. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహం ఎవరిదీ, దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇక విగ్రహానికి 50 నుంచి 60 కోట్లు వస్తాయని గౌరీ, మైత్రేయన్ అనుకుంటారు. కానీ, దానికి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో 150 కోట్లు వస్తాయని చివర్లో చూపిస్తారు.

క్లైమాక్స్ ట్విస్ట్

మైత్రేయన్ మరదలితో గౌరీ లవ్ ట్రాక్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది. కానీ, దాన్ని ఎక్కువగా సాగదీయలేదు. క్లైమాక్స్‌లో ఏదో ట్విస్ట్ ఉంటుంది అని చాలావరకు ఊహించవచ్చు. దానికితగినట్లుగానే క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్ని బాగా కుదిరాయి. మధ్యలో వచ్చే ఓ పాట అంతగా ఆకట్టుకోదు. శరత్ కుమార్, అమితాష్ ప్రధాన్ యాక్టింగ్ అదరగొట్టారు. అమాయకంగా ఉంటూ తెలివైన వాడిగా అమితాష్ ప్రధాన్ మంచి నటన చూపించాడు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఇక శరత్ కుమార్ ఈ మధ్య ఎక్కువగా పోలీస్ రోల్స్ చేస్తున్నారు. కానీ, క్యారెక్టర్‌లో వేరియేషన్స్ ఉంటున్నాయి. పరంపోరుల్‌లో గ్రే షేడ్స్‌లో శరత్ కుమార్ ఆకట్టుకున్నారు. ఇక గ్లామర్‌తో పాటు ఇంపార్టెంట్ రోల్‌తో కశ్మీరా పరదేశి అలరించింది. మిగతా పాత్రలు కూడా మంచి పర్పామెన్స్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చేవారికి పరంపోరుల్ మూవీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

Whats_app_banner