ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
సారంగపాణి జాతకం మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. శుక్రవారం (మే 23) ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగుతో పాటు తమిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోపే సారంగపాణి జాతకం మూవీ ఓటీటీలోకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సారంగపాణి జాతకం మూవీలో ప్రియదర్శికి జోడీగా రూపకొడవాయూర్ హీరోయిన్‌గా నటించింది. వెన్నెలకిషోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. జాతకాలను అతడి నమ్మడం వల్ల ఎలాంటి అనార్థాలు తలెత్తుతాయన్నది నవ్విస్తూనే థ్రిల్లింగ్‌గా డైరెక్టర్ ఈ మూవీలో చూపించాడు.
ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ కామెడీతో ఈ మూవీ ఆకట్టుకున్నా....స్టోరీ ప్రెడిక్టబుల్‌గా ఉండటం, ఎమోషన్ ఆశించిన స్థాయిలో పండకపోవడం మైనస్‌గా మారింది. చిన్న కథను తీసుకొని కామెడీతోనే ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.
సారంగపాణి(ప్రియదర్శి) కి జాతకాల పిచ్చి ఎక్కువ. చేతి గీతలే తలరాత మారుస్తాయని నమ్ముతుంటాడు. కార్ షోరూమ్‌లో తనతో పాటు పనిచేసే మైథలిని (రూప కొడవాయూర్) ప్రేమిస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సారంగపాణి, మైథిలి అనుకుంటారు.
ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. సారంగపాణి ఓ మర్డర్ చేస్తాడని అతడి చేతి రేఖలు చూసి జాతకం చెబుతాడు ఆస్ట్రాలజర్ జిగేశ్వరానంద్ (శ్రీనివాస్ అవసరాల). జిగేశ్వరానంద్ మాటలు నమ్మిన సారంగపాణి... హంతకుడి భార్య అనే ముద్ర మైథిలిపై పడకూడదని పెళ్లికి ముందే ఓ హత్య చేయాలని ప్లాన్స్ చేస్తాడు.
ఈ మర్డర్ ప్లాన్‌లో సారంగపాణికి అతడి స్నేహితుడు చందు (వెన్నెలకిషోర్) ఎలా సాయం చేశాడు. అతడి మర్డర్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా? సారంగపాణితో ఎంగేజ్‌మెంట్‌ను మైథిలి ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? అన్నదే ఈ మూవీ కథ.
ఈ ఏడాది కోర్ట్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు ప్రియదర్శి. హీరో నాని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో లాయర్‌గా ప్రియదర్శి నటనను ప్రశంసలు దక్కాయి.
సంబంధిత కథనం