Sarangapani Jathakam Release Date: సమ్మర్ హాలిడేస్ లో సారంగపాణి మన ముందుకు వస్తున్నాడు. గతేడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్.. హాలిడేస్ కోసం రెడీ చేస్తున్నారు. తాజాగా సోమవారం (మార్చి 17) రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ప్రియదర్శి నటించిన మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ఇది.
కానీ అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నిర్మించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
ప్రియదర్శి నటించిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ సారంగపాణి జాతకం. ఈ సినిమాకు అష్టా చెమ్మా, జెంటిల్‌మెన్, సమ్మోహనం, వీ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా చేస్తే.. రూప కొడువాయూర్ హీరోయిన్‌గా జంటగా నటించింది. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది.
గతేడాది డిసెంబర్ 20నే థియేటర్లలోకి రావాల్సింది. అంతకుముందు నవంబర్ 21నే టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ సినిమాలో హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. 'మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది' అని చెబుతుంటాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, అది నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడి పాత్రలో ప్రియదర్శి నటించాడు.
మరి, ఆ జాతకాలపై మితిమీరిన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్‌ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ల భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు అనేది ఈ సినిమాలో చూడొచ్చు.
సంబంధిత కథనం