OTT Telugu Family Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-sarangadariya ott release date on aha this family drama movie will be steaming from august 31 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Family Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Telugu Family Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 27, 2024 03:18 PM IST

Sarangadariya OTT Release Date: సారంగదరియా సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రాజా రవీంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలోకి అడుగుపెట్టనుందంటే..

OTT Family Drama Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Family Drama Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ‘సారంగదరియా’ చిత్రం ట్రైలర్‌తో ఆసక్తిని కలిగించింది. సీనియర్ నటుడు రాజారవీంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ మోస్తరు టాక్ తెచ్చుకుంది. సారంగదరియా చిత్రానికి పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. సారంగదరియా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సారంగదరియా సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 31వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఈ వారమే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేయనుంది.

సారంగదరియా సినిమాలో రాజారవీంద్ర యాక్టింగ్ హైలైట్‍గా నిలిచింది. కుటుంబ బాధ్యతలను మోసే ఓ మధ్యతరగతి తండ్రిగా ఆయన నటన మెప్పించింది. ఫ్లామిలీ డ్రామా సినిమా అయినా ఓ కొత్త పాయింట్‍లో ఈ చిత్రాన్ని తెరక్కించారు దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి. ఈ విషయంలో ఆయనపై ప్రశంసలు దక్కాయి.

సారంగదరియా చిత్రంలో రాజారవీంద్రతో పాటు శివచందు, యశస్వినీ, శ్రీకాంత్ అయ్యంగార్, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ, కాదంబరి కిరణ్, హర్షవర్దన్, నీల ప్రియ కీలకపాత్రలు పోషించారు. సజ్జా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర ఈ మూవీని నిర్మించారు.

సారంగదరియా మూవీకి ఎబెనేజర్ పాల్ సంగీతం అందించగా.. సిద్ధార్థ్ స్వయంభు సినిమాటోగ్రఫీ చేశారు. శ్రీకరణ్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు రాబట్టకోలేకపోయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 31 నుంచి ఆహాలో చూడొచ్చు.

సారంగదరియా స్టోరీలైన్

ఓ మధ్యతరగతి కుటుంబంలోని పరిస్థితులు, ఎదురైన సవాళ్ల చుట్టూ సారంగదరియా సినిమా సాగుతుంది. కృష్ణకుమార్ (రాజా రవీంద్ర) ఓ కాలేజీలో కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేస్తుంటారు. ఆయన పెద్ద కొడుకు అర్జున్ (మొయిన్ మహమ్మద్) ప్రేమలో విఫలమవుతాడు. మద్యానికి బానిసై గొడవలు పడుతుంటాడు. చిన్న కొడుకు సాయి (మోహిత్) ఖాళీగా తిరుగుతుంటాడు. ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు.

అయితే, కృష్ణకుమార్ కూతురు అనుపమ (యశస్విని) మాత్రం పద్ధతిగా ఉంటుంది. తండ్రి చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటుంది. అయితే, అనుపమ గురించి ఓ షాకింగ్ విషయం బయటపడుతుంది. దీంతో పరిస్థితులు తారుమారు అవుతాయి. కృష్ణకుమార్ ఆందోళనలో పడతాడు. వారి కుటుంబం అవమానాల పాలవుతుంది. అనుపమ గురించిన ఆ రహస్యం ఏంటి? ఎందుకు కృష్ణకుమార్‌ ఆందోళన చెందాడు? ఈ సమస్యల నుంచి వారి కుటుంబం బయటపడిందా? మతం అడ్డుతొలగి సాయి ప్రేమ కథ సక్సెస్ అవుతుందా? అనేవి సారంగదరియా చిత్రంలో ఉంటాయి.

సారంగదరియా సినిమా కథ‍లో ఓ విభిన్నమైన సమస్య గురించి దర్శకుడు చూపించారు. కుటుంబంలో మానసిక సంఘర్షణ, ఎమోషన్లను మెరుగ్గా తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఆహాలో పురుత్తముడు

ఆహా ఓటీటీలోకి పురుషోత్తముడు సినిమా కూడా వచ్చేస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా సినిమా ఆగస్టు 29వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో హాసినీ సుధీర్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ కీరోల్స్ చేశారు. శ్రీనాథ్ పులకూరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీశ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్ ప్రొడ్యూజ్ చేశారు.