Crime Thriller OTT: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ .. ఆసక్తికరంగా ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ?
Crime Thriller Web Series OTT: క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. క్రిమినల్ గురించి వాస్తవాలను బయటపెట్టేందుకు జర్నలిస్టు ప్రయత్నం చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.

షకీబ్ సలీం ప్రధాన పాత్ర పోషించిన ‘క్రైమ్ బీట్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు సుధీర్ మిశ్రా, సంజీవ్ కౌల్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ లుక్ నుంచే ఈ సిరీస్ క్యూరియాసిటీ పెంచింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 11) రిలీజ్ అయింది.
క్రైమ్ బీట్ ట్రైలర్ ఇలా..
జర్నలిస్టుగా ఫేమస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రైమ్ రిపోర్టర్ అభిషేక్ సిన్హా (షకీబ్ సలీమ్) చుట్టూ క్రైమ్ బీట్ సిరీస్ సాగుతుంది. విదేశాలకు పారిపోయి మళ్లీ ఢిల్లీకి వచ్చే బిన్నీ చౌదరి (రాహుల్ భట్) అనే ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిసైడ్ అవుతాడు జర్నలిస్టు అభిషేక్. ఓ కేసు విషయంలో తీవ్రంగా దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటాడు. విషయాలను తెలుకునే కొద్దీ అతడికి సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అయినా ఆ క్రిమినల్ గురించి విషయాలను బయటికి తీసుకొచ్చేందుకు నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అభిషేక్ సిన్హా అనుకున్నది చేశాడా అనే విషయాలు ఈ సిరీస్‍లో ప్రధానంగా ఉండనున్నాయి. క్రిమినల్ బ్యాక్‍గ్రౌండ్‍లో ఉన్న వారికి కొన్ని వ్యవస్థలతో ఎలాంటి రిలేషన్ ఉంటుందనే విషయాలను కూడా ట్రైలర్లో మేకర్స్ చూపించారు.
క్రైమ్ బీట్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. క్రిమినల్‍ను పట్టుకునేందుకు ఓ జర్నలిస్టు ఎంత కసిగా ముందుకు సాగాడో ఆకట్టుకుంది. డైరెక్టర్లు సుధీర్ మిశ్రా, సంజీవ్ కౌల్ టేకింగ్ కూడా మెప్పించేలా కనిపిస్తోంది. పక్కా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లా కనిపిస్తోంది.
క్రైమ్ బీట్ వెబ్ సిరీస్‍లో షకీబ్ సలీంతో పాటు సబా ఆజాద్, రాహుల్ భట్, సాయి తంహనకర్, రాజేశ్ తైలంగ్ దనిష్ హుసేన్, ఆదినాథ్ కొటారే కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍ను కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకం నిర్మించింది.
స్ట్రీమింగ్ డేట్
క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 21వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. “ఎలాగైనా రహస్యాలను దాచి ఉంచాలని అనుకునే ప్రపంచంలో.. అతడు నిజాలను బయటికి తీసుకొచ్చేందుకు ఏమైనా చేసేందుకు సిద్ధమయ్యాడు” అంటూ ఈ ట్రైలర్‌ను జీ5 సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 14వ తేదీన ప్యార్ టెస్టింగ్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్‍లో సత్యజీత్ దూబే, ప్రతిభ బోర్తాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం