Yuva OTT: కన్నడ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కాంతారతో దక్షిణాదిలో పాపులరైంది హీరోయిన్ సప్తమిగౌడ. ఈ సినిమాలో గ్లామర్ హంగులకు దూరంగా అణిచివేతకు గురైన ఓ వర్గానికి అండగా నిలబడే ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచింది సప్తమి గౌడ. కాంతరతో హిట్టు అందుకున్న ఆమెకు మాతృభాష కన్నడంతో పాటు తెలుగు, తమిళ భాషల నుంచి పలు అవకాశాలు వరిస్తున్నాయి.
కాంతర తర్వాత కన్నడంలో యువ సినిమాలో హీరోయిన్‌గా నటించింది సప్తమి గౌడ. శుక్రవారం ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన సరిగ్గా ఇరవై రోజుల గ్యాప్‌లోనే ఈ కన్నడ మూవీ ఓటీటీలో రిలీజైంది. యువ మూవీ మార్చి 29న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్టు టాక్‌ను తెచ్చుకున్నది. అయినా ఈ మూవీ త్వరగా ఓటీటీలో రిలీజ్ కావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఫ్రీ స్ట్రీమింగ్‌తో కాకుండా రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లో యువ రిలీజైంది. నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ ఉండబోతున్నట్లు సమాచారం.
యువ సినిమాతో రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడు సాండల్‌వుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యువరాజ్‌కుమార్ కథానాయకుడిగా ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. శివరాజ్‌కుమార్ అన్నయ్య అయిన రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడే యువరాజ్‌కుమార్. ఈ సినిమాను కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. సంతోష్ ఆనంద్‌రామ్ దర్శకత్వం వహించాడు.
యువ రాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ కావడంతో కన్నడ నాట యువ మూవీపై భారీగా హైప్ ఏర్పడింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో శివరాజ్‌కుమార్‌తో పాటు కిచ్చా సుదీప్, యశ్ వంటి స్టార్ హీరోలు కూడా పాల్గొన్నారు కానీ కాన్సెప్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా అతడి యాక్టింగ్‌పైనే ఎక్కువగా విమర్శలొచ్చాయి.
యువ రెజ్లర్, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై రెజ్లింగ్ నుంచి నిషేధం విధిస్తారు. దోషిగా ముద్రపడ్డ యువను అతడి తండ్రి ద్వేషిస్తుంటాడు. రెజ్లింగ్‌కు దూరమైన యువ ఇంజినీరింగ్ పూర్తిచేస్తాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఫుడ్ డెలివరీబాయ్‌గా పనిచేస్తుంటాడు. స్టాక్ మార్కెట్ బిజినెస్ పేరుతో యువ తండ్రిని కొందరు మోసం చేస్తారు.
అప్పుల్లో కూరుకుపోయిన తండ్రిని కాపాడటానికి యువ ఆ మోసగాళ్లతో ఎలాంటి పోరాటం చేశాడు? యువ నిజంగానే రెజ్లింగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడా? అతడిపై ఈ ఆరోపణలు చేసింది ఎవరు? కష్టాల్లో యువకు అండగా నిలిచిన సిరి ఎవరు అన్నదే ఈ మూవీ కథ. యువ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు.
ఈ ఏడాదే సప్తమి గౌడతెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.