Venkatesh: బుల్లితెరపైకి హీరో వెంకటేష్.. సంక్రాంతి స్పెషల్‌గా హీరోయిన్లతో సందడి.. ఏ ఊరిలో? ఎప్పుడంటే?-sankranthiki vasthunnam venkatesh anil ravipudi meenakshi chaudhary aishwarya rajesh guest to zee telugu event kakinada ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh: బుల్లితెరపైకి హీరో వెంకటేష్.. సంక్రాంతి స్పెషల్‌గా హీరోయిన్లతో సందడి.. ఏ ఊరిలో? ఎప్పుడంటే?

Venkatesh: బుల్లితెరపైకి హీరో వెంకటేష్.. సంక్రాంతి స్పెషల్‌గా హీరోయిన్లతో సందడి.. ఏ ఊరిలో? ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu

Venkatesh Guest To Zee Telugu Sankranthi Event: బుల్లితెర ప్రేక్షకులను స్వయంగా కలిసి సందడి చేసేందుకు హీరో విక్టరీ వెంకటేష్ జీ తెలుగు సంక్రాంతి స్పెషల్ ఈవెంట్‌కు అతిథిగా రానున్నాడు. వెంకటేష్‌తోపాటు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొననున్నారు.

బుల్లితెరపైకి హీరో వెంకటేష్.. సంక్రాంతి స్పెషల్‌గా హీరోయిన్లతో సందడి.. ఏ ఊరిలో? ఎప్పుడంటే?

Venkatesh Meenakshi Chaudhary Zee Telugu: నిరంతరం వినోద కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు రెండు రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుల్లితెర అభిమానులను పలకరిస్తోంది. ఈ ఏడాది వరుస ఈవెంట్లతో అలరించిన జీ తెలుగు 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది.

జీ తెలుగు సంక్రాంతి స్పెషల్ ఈవెంట్

తెలుగువారి పెద్ద పండగైన సంక్రాంతిని మరింత సంబరంగా జరుపుకునేందుకు కాకినాడకు వచ్చేస్తోంది. హీరో విక్టరీ వెంకటేష్​, సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్​, మీనాక్షి చౌదరి ముఖ్య​ అతిథులుగా జీ తెలుగు సంక్రాంతి స్పెషల్​ ఈవెంట్​ నిర్వహించనుంది.

కాకినాడలో సంక్రాంతి సంబురాలు

‘సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం’ అనే టైటిల్‌తో నిర్వహిస్తున్న ఈ జీ తెలుగు స్పెషల్ ఈవెంట్‌ కాకినాడలో జరగనుంది. అంటే, హీరో హీరోయిన్లతో కాకినాడలో సంక్రాంతి సంబరాలు చేయనుంది జీ తెలుగు. ఇక‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ బుల్లితెర ఈవెంట్‌లో వెంకటేష్, అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పాల్గొంటున్నారు.

డిసెంబర్ 28న

కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్​ సందడి చేయనున్న ఈ జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ను డిసెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలో నిర్వహించనున్నారు. అంటే, ఆరోజు బుల్లితెర ప్రేక్షకులను వెంకటేష్ స్వయంగా కలవనున్నాడని తెలుస్తోంది.

అడ్రస్ ఇదే

కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల (P.R Government College) గ్రౌండ్​ వేదికగా జీ తెలుగు సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బుల్లితెర అభిమానుల సందడితో కోలాహలంగా జరగనున్న ఈ కార్యక్రమానికి యాంకర్​ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా జీ తెలుగు సీరియల్స్​ నటీనటులు కూడా సందడి చేయనున్నారు.

రాజేంద్ర ప్రసాద్, ఆమని కూడా

ఈ ఆత్మీయ సమ్మేళనంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీమ్​ కూడా పాల్గొని అభిమానులను అలరించనుంది. హీరో విక్టరీ వెంకటేష్​, డైరెక్టర్​ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్​, మీనాక్షి చౌదరితోపాటు సీనియర్​ నటులు రాజేంద్ర ప్రసాద్, ఆమని, శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

జీ తెలుగు తారలు సైతం హాజరు

బుల్లితెరపై నటనతో అలరిస్తున్న జీ తెలుగు తారలు తమ అభిమానులతో కలిసి సంక్రాంతి జరుపుకునేందుకు కాకినాడ​ వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రేక్షకులు మీరూ జీ తెలుగు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మీ అభిమాన తారలను నేరుగా పలకరించే అవకాశం పొందండి అని జీ తెలుగు ప్రకటించింది.

కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా మూవీ

ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించారు. ఇదివరకు ఈ సినిమా నుంచి పోస్టర్స్‌తోపాటు ఓ సాంగ్ రిలీజ్ అయింది. రెండో పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నట్లు సమాచారం.