Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా-sankranthiki vasthunnam sensational ticket advance bookings venkatesh biggest opening day collections loading ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా

Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2025 10:16 PM IST

Sankranthiki Vasthunnam Bookings: సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అంచనాలకు మించి టికెట్ల బుకింగ్స్ జరుగుతున్నాయి. తొలి రోజు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..

Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా
Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. గోదారి గట్టు పాటతో ఈ చిత్రానికి చాలా బజ్ వచ్చింది. అది కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగకు సూటయ్యేలా ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి రోజు జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. కొన్ని రోజులుగా ప్రమోషన్లను హీరో వెంకటేశ్, అనిల్‍తో పాటు మూవీ టీమ్ సభ్యులు జోరుగా చేస్తున్నారు. వరుసగా ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ట్రైలర్ కూడా ఆకట్టుకోవటంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి భారీగా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

yearly horoscope entry point

బుకింగ్స్‌లో దూకుడు

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భారీ స్థాయిలో టికెట్ల బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా రిలీజ్‍కు రెండు రోజులు ఉండగానే సెన్సేషనల్ బుకింగ్స్ సాగుతున్నాయి. ఒక్క బుక్ మై షో ప్లాట్‍ఫామ్‍లోనే ఇప్పటి వరకు ఈ మూవీకి లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా బుకింగ్స్ జోరు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల థియేటర్లు అప్పుడే ఫుల్ అవుతున్నాయి. పక్కా సంక్రాంతి చిత్రంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

వెంకీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్

విక్టరీ వెంకటేశ్‍కు ఇప్పటి వరకు తొలి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎఫ్3 చిత్రమే. ఈ మూవీ ఫస్ట్ డే సుమారు రూ.14కోట్లను రాబట్టింది. అయితే, బుకింగ్స్ బట్టి చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ మార్కును దాటేయడం పక్కా. వెంకీకి ఈ చిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఉండనుంది. ఈ చిత్రం ఫస్ట్ డే రూ.20కోట్ల మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఫలించిన ప్రమోషన్లు

సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం వెంకటేశ్, దర్శకుడు అనిల్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి అలుపెరగకుండా ప్రమోషన్లు చేస్తున్నారు. విభిన్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు కూడా చాలా ప్లస్ అయ్యాయి. గోదారి గట్టు పాట చాలా పాపులర్ అయింది. ఓ ఊపు ఊపేస్తోంది. వెంకటేశ్ పాడిన పాట బ్లాక్‍బస్టర్ పొంగల్ కూడా మోతమోగిపోతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు. పాటలతోనే ఈ చిత్రానికి ఫుల్ బజ్ వచ్చింది. ప్రమోషన్లతో దాన్ని మరో రేంజ్‍కు తీసుకెళ్లింది మూవీ టీమ్. ఈవెంట్లలో ఫుల్ జోష్‍తో డ్యాన్స్ కూడా వేశారు వెంకటేశ్.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి చేసిన ప్రమోషన్లు బాగా ఫలించాయి. ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోగా.. ప్రమోషన్లు కూడా మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇవన్నీ కలిపి ఈ చిత్రానికి భారీగా బుకింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇక భారీ కలెక్షన్లు ఖాయమే. పండుగకు ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రం చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాను దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. వీరు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ కూడా సంక్రాంతి రేసులో జనవరి 10వ తేదీనే రిలీజ్ అయింది. రామ్‍చరణ్ హీరోగా నటించిన ఆ భారీ పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ కూడా నేడు (జనవరి 12) థియేటర్లలో రిలీజ్ అయింది.

Whats_app_banner

సంబంధిత కథనం