Sankranthiki Vasthunnam OTT TV ఇవాళ ఓటీటీ, టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ- సుడిగుండంలో సాగే ప్రయాణం అంటూ వెంకటేష్!-sankranthiki vasthunnam ott release on zee5 today tv premiere in zee telugu venkatesh comments anil ravipudi aishwarya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranthiki Vasthunnam Ott Tv ఇవాళ ఓటీటీ, టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ- సుడిగుండంలో సాగే ప్రయాణం అంటూ వెంకటేష్!

Sankranthiki Vasthunnam OTT TV ఇవాళ ఓటీటీ, టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ- సుడిగుండంలో సాగే ప్రయాణం అంటూ వెంకటేష్!

Sanjiv Kumar HT Telugu

Venkatesh About Sankranthiki Vasthunnam OTT Streaming: ఓటీటీలో ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే, జీ తెలుగు ఛానెల్‌లో కూడా సంక్రాంతికి వస్తున్నాం టీవీ ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, జీ5 ప్రతినిధి కామెంట్స్ చేశారు.

ఇవాళ ఓటీటీ, టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ- సుడిగుండంలో సాగే ప్రయాణం అంటూ వెంకటేష్!

Venkatesh About Sankranthiki Vasthunnam OTT Release: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం జీ5, జీ తెలుగు రెండింట్లోనూ ఏకకాలంలో ప్రీమియర్‌గా ఇవాళ (మార్చి 1) ప్రదర్శించనున్నారు.

ఐదు భాషల్లో ఓటీటీలో

థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని జీ తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్‌తో పాటుగా జీ5 ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో జీ5 ప్రతినిధి మాట్లాడుతూ.. "జీ5, జీ తెలుగు రెండింటిలోనూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మా ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల కంటెంట్‌ను అందించడం పట్ల మేము గర్విస్తున్నాం. మా ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్త కంటెంట్‌ను ఆదరిస్తుంటారు" అని అన్నారు.

ఏక కాలంలో స్ట్రీమింగ్

"ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాంటి సినిమాను మా ఆడియెన్స్‌కు అందిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతిభావంతులైన దర్శకులు, నటీనటుల బృందంతో కలిసి పనిచేయడం మాకు ఓ అద్భుతమైన అనుభవం. ప్రస్తుతం ప్రేక్షకులు టీవీ, ఓటీటీ రెండింటిలోనూ ఏక కాలంలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ప్రతీ ఒక్కరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాం" అని జీ5 ప్రతినిధి తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ5, జీ తెలుగులో వస్తుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతోంది. నా జీవితంలో ఈ చిత్రం ఓ మరుపురాని అద్భుతం. వెంకటేష్ దగ్గుబాటి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఉపేంద్ర లిమాయేల అద్భుతమైన ప్రదర్శనలు కథను మరింత ఎలివేట్ చేశాయి. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఈ డ్యూయల్ రిలీజ్ ప్రతి ఒక్కరూ ఆనందించేలా ఉంటుంది" అని అన్నారు.

న్యాయం చేయడం

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ .. "సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో రాజు పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. అతని జీవిత ప్రయాణం, సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా సాగే ప్రయాణం అందరినీ నవ్విస్తుంది. అలాంటి పాత్రలో నటించడం, అందరినీ మెప్పించేలా న్యాయం చేయడం ఆనందంగా ఉంది. ఈ స్క్రిప్ట్‌ పూర్తిగా అందరినీ నవ్వించేలానే ఉంటుంది" అని అన్నారు.

"థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. ఇప్పుడు జీ5, జీ తెలుగులో ఈ చిత్రం రాబోతోంది. టీవీల్లో, ఓటీటీలో ఆడియెన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది" అని హీరో వెంకటేష్ తెలిపారు.

ఇదే నాకు మొదటిసారి

"భాగ్యలక్ష్మి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు పోషించడం నాకు ఇదే మొదటి సారి. అమాయకత్వం, పొసెసివ్‌నెస్‌ ఇలా రెండింటినీ చూపించే పాత్ర. ఇలాంటి పాత్రను వెంకటేష్ గారి పక్కన పోషించడం ఆనందంగా ఉంది. నటీనటుల మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. ఇది టీవీ, ఓటీటీ రెండింటిలోనూ ఆడియెన్స్‌కి అందుబాటులోకి వచ్చింది. అందరినీ నవ్వించేలా మా చిత్రం ఉంటుంది" అని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది.

కాగా కామెడీ ఎంటర్టైనర్‌గా నవ్వులు పంచే ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ జీ తెలుగు, జీ5 ఓటీటీలో ఇవాళ (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు అటు ప్రీమియర్, ఇటు స్ట్రీమింగ్ రెండు కానుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం