Meenakshi Chaudhary About Balakrishna: గుంటూరు కారం, మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్ సినిమాలతో అలరించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతోపాటు సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీనాక్షి చౌదరి.
-ఇది మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. మేజర్ పోర్షన్ కామెడీ ఉంటుంది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్నీ ఎమోషన్స్ ఉంటాయి.
-నేను యాక్ట్ చేసిన సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. తర్వాత నా పేరు 'మీను' మీద వచ్చిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో సినిమా కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.
-ఈ సినిమా ప్రమోషన్స్‌కి నా దగ్గర టైమ్ ఉంది. కొత్త కొత్త ఐడియాలతో సినిమాని ప్రమోట్ చేస్తున్నాం. వెంకీ మామ క్యారెక్టర్స్‌తో స్కిట్ చేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియన్స్.
-ఐశ్వర్య రాజేశ్ గారు ఎస్టాబ్లిష్ యాక్టర్. ఐశ్వర్య నటించిన చాలా సినిమాలు చూశాను. ఒక ఫ్యాన్ మూమెంట్‌లా అనిపించింది. తను చాలా పాజిటివ్‌గా ఉంటారు. తనతో కలసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
-అనిల్ గారి కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్. కామెడీ తీయడం అంత ఈజీ కాదు. సీన్ బెటర్‌మెంట్ కోసం స్పాంటినియస్‌గా ఆలోచించాలి. సీన్ బెటర్ చేయడంలో అనిల్ గారి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను కామెడీ చేయడం ఫస్ట్ టైమ్. ఆయన చాలా ఓపికగా ప్రతిది డిటేయిల్‌గా ఎక్స్‌ప్లేయిన్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.
-దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. దిల్ రాజు గారు ప్రమోషన్స్‌లో కూడా పార్ట్ అవ్వడం ఆనందంగా అనిపించింది. శిరీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. దిల్ రాజు గారి నుంచి వస్తున్న గేమ్ ఛేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
-బాలకృష్ణ గారు.. వన్ అండ్ ఓన్లీ ఓజీ (నవ్వుతూ). ఎప్పుడూ యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. చాలా ఎమోషనల్ అండ్ వండర్‌ఫుల్ పర్సన్.
-నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఏడాది కూడా వండర్‌ఫుల్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను.