Sankranthiki Vasthunnam: తొలిసారి కలెక్షన్లలో ఈ మార్క్ దాటిన వెంకటేశ్.. సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల జోరు.. ఎంతంటే..
Sankranthiki Vasthunnam Day 5 Box office Collections: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. జోరుగా కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళుతోంది. వెంకటేశ్ కెరీర్లో హెయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డును సాధించేసింది. ఐదు రోజుల్లో ఈ మూవీ వసూళ్లు ఎంతంటే..
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద నాన్‍స్టాప్‍గా దూసుకెళుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో కలెక్షన్లలో జోరు కంటిన్యూ చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాజిటివ్ టాక్‍తో ఆరంభం నుంచి దుమ్మురేపుతోంది. తాజాగా వెంకటేశ్ కెరీర్లో అత్యధిత గ్రాస్ కలెక్షన్ల రికార్డును సాధించింది. ఆ వివరాలు ఇవే..

ఐదు రోజులు కలెక్షన్లు ఇలా..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఐదో రోజు వరల్డ్ వైడ్‍గా రూ.30కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో లెక్క రూ.161 కోట్ల గ్రాస్‍కు చేరింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జనవరి 19) వెల్లడించింది. ఐదు రోజుల కలెక్షన్లతో అఫీషియల్ పోస్టర్ కూడా రివీల్ చేసింది.
తొలిసారి రూ.150కోట్ల మార్క్ దాటిన వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ కెరీర్లో హెయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డు సాధించింది. అనిల్‍తోనే వెంకీ చేసిన ఎఫ్2 సుమారు రూ.140 కోట్లు కలెక్ట్ చేసిందని అంచనా. ఇదే వెంకటేశ్ కెరీర్లో ఇప్పటి వరకు అత్యధికం. దీన్ని సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఐదు రోజుల్లోనే దాటేసింది. తన కెరీర్లో తొలిసారి రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును వెంకటేశ్ అధిగమించారు. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ రూ.161కోట్లు కలెక్ట్ చేసి అదగొట్టింది.
ఆరో రోజైన ఆదివారం కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భారీగా టికెట్ల బుకింగ్స్ జరిగాయి. చాలాచోట్ల హౌస్‍ఫుల్స్ పడ్డాయి. దీంతో మంచి గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లోగానే రూ.200కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ అన్ని చోట్ల లాభాల్లోకి అడుగుపెట్టేసింది. తిరుగులేని బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు పోటీలో ఉన్నా.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే ఈ పండుగ విజేతగా నిలిచింది.
కామెడీ, ఫ్యామిలీ డ్రామాను కలిపి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు అనిల్ రావివూడి. ఈ మూవీలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నరేశ్, వీటీవీ గణేశ్, బాలనటుడు రేవంత్, ఉపేంద్ర లిమాయే, సాయికుమార్, పృథ్విరాజ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ రెడ్డి కూడా కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమా కోసం వెంకటేశ్, డైరెక్టర్ అనిల్, హీరోయిన్లు ఐశ్వర్య, మీనాక్షి ప్రమోషన్లు భిన్నంగా, జోరుగా చేశారు. ఈ చిత్రానికి ఇవి కూడా బాగా ప్లస్ అయ్యాయి. భీమ్స్ ఇచ్చిన పాటలు క్రేజ్‍ను తీసుకొచ్చాయి. మొత్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.
సంబంధిత కథనం
టాపిక్