Sankranthiki Vasthunnam: ఫస్ట్ డే కుమ్మేసిన సంక్రాంతికి వస్తున్నాం - వెంకీ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్
Sankranthiki Vasthunnam: వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. శుక్రవారం రోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 24 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. వెంకటేష్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
Sankranthiki Vasthunnam Collections: సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. వెంకటేష్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

ఫ్యామిలీ అంశాలకు థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఇరవై నాలుగు కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వెంకటేష్ సైంధవ్ మూవీతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం ఐదింతలకుపైగా వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఓవర్‌సీస్‌లోనూ తొలిరోజు ఆరు కోట్ల వరకు కలెక్షన్స్‌ను దక్కించుకున్నది.
ఇద్దరు హీరోయిన్లు...
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నరేష్, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమాయో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. సినిమాకు పాటలు మంచి హైప్ తీసుకొచ్చాయి.
నో లాజిక్...ఓన్లీ ఫన్..
భార్యభర్తల మధ్య ఉండే అపోహలు, గొడవలకు ఓ కిడ్నాప్ డ్రామాను జోడించి దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు. లాజిక్స్‌తో సంబంధం లేకుండా ఆరంభం నుంచి ముగింపు వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమాలో భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో వెంకీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా...మాజీ లవర్‌గా మీనాక్షి చౌదరి కనిపించింది.
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్...
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ ఆఫీసర్ వైడీ రాజు (వెంకటేష్) చేయని తప్పుకు సస్పెండ్అవుతాడు. ఆ కోపంతో పోలీస్ జాబ్‌కు రిజైన్ చేస్తాడు. భాగ్యలక్ష్మిని (ఐశ్వర్య రాజేష్) పెళ్లిచేసుకొని నలుగురు పిల్లల తండ్రిగా ఇల్లరికం అల్లుడిగా సెటిల్ అవుతాడు. హ్యాపీగా సాగిపోతున్న రాజు, భాగ్యం లైఫ్ మీనాక్ష్మి ఎంట్రీతో కొత్త మలుపు తిరుగుతుంది. రాజు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌నంటూ అతడిని వెతుక్కుంటూ వస్తుంది? మీనాక్షి చెప్పింది నిజమేనా?
మీనాక్షిని ప్రేమించిన రాజు ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? అమెరికా నుంచి తెలంగాణకు వచ్చిన బిజినెస్‌మెన్ ఆకెళ్లను(శ్రీనివాస్ అవసరాల) బీజు పాండే గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేసింది?ఆకెళ్లను విడిపించే బాధ్యతను సీఏం (సీనియర్ నరేష్) రాజుతో పాటు మీనాక్షికి అప్పగించడానికి కారణమేమిటి? ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం రాజు వెంట అతడి భార్య భాగ్యం ఎందుకు వెళ్లాల్సివచ్చింది అన్నదే ఈ మూవీ కథ.
మూడు సినిమాలు...
ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో పాటు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు రిలీజయ్యాయి. గేమ్ ఛేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు నిర్మాత దిల్ రాజు కావడం గమనార్హం. జనవరి 10న రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీకి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. బాలకృష్ణ డాకు మహారాజ్ డీసెంట్ కలెక్షన్స్‌తోదూసుకుపోతుంది.