Sankranthiki Vasthunnam Collection: 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. బిజినెస్‌లో 95 శాతం వసూలు!
Sankranthiki Vasthunnam Worldwide Box Office Collection Day 3: విక్టరీ వెంకటేష్ నటించిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ వివరాలపై లుక్కేద్దాం.
Sankranthiki Vasthunnam 3 Days Box Office Collections: దగ్గుబాటి వెంకటేష్-డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మూడోసారి తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందింన సంక్రాంతికి వస్తున్నాంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు.
పాజిటివ్ రివ్యూస్-మంచి కలెక్షన్స్
జనవరి 14న సంక్రాంతికి కానుకగా థియేటర్లలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి రెస్పాన్స్‌తోపాటు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ బాగున్నాయి. మొదటి రోజు ఇండియాలో రూ. 23 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు మాత్రం రూ. 20 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దాంతో 13.04 శాతం తగ్గుదలను చూసిందీ సినిమా.
మూడో రోజు కలెక్షన్స్
ఇక మూడో రోజు అయిన గురువారం (జనవరి 16) ప్రస్తుతం బుక్ అయిన ఆన్‌లైన్ టికెట్స్, ఆఫ్ లైన్ లెక్కల ప్రకారం రూ. 13.03 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. అంటే, రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు భారీగా వసూళ్లు తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో భారతదేశంలో మూడు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 56.03 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని సక్నిల్క్ పేర్కొంది.
95 శాతం రికవరీ
ఇదిలా ఉంటే, ఓపెనింగ్ రోజున ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఇక రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 40.07 కోట్ల షేర్, రూ. 65.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు పలు ట్రేడ్ సంస్థలు తెలిపాయి. దాంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఫిక్స్ అయిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42.50 కోట్లల్లో 95 శాతం రికవరీ అయినట్లు పేర్కొన్నాయి.
హిట్‌కు అతి తక్కువ టార్గెట్
అంటే, పెట్టిన ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 95 శాతం వచ్చేసినట్లే అని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమా హిట్ కావాలంటే ఇంకా రూ. 2.63 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఈ అతి తక్కువ టార్గెట్‌ను కూడా మూడో రోజే ఫినీష్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వంద కోట్ల క్లబ్‌లో
అంతేకాకుండా, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రెండు రోజుల్లో రూ. 77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు, మూడో రోజు వంద కోట్లు కొల్లగొట్టి హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉందని హన్స్ ఇండియా వెబ్ సైట్ పేర్కొంది. మరి, ఆన్‌లైన్‌తోపాటు పూర్తి ఆఫ్ లైన్ టికెట్స్ వివరాలు బయటకు రాగానే సంక్రాంతికి వస్తున్నాం 3 రోజుల కలెక్షన్స్ పూర్తి స్థాయిలో తెలియనున్నాయి.
సంబంధిత కథనం