Sankranthiki Vasthunam TRP Rating: టీఆర్పీ రేటింగ్స్‌లో దుమ్ము రేపిన సంక్రాంతికి వస్తున్నాం.. జీ తెలుగులో నయా రికార్డు-sankranthiki vasthunam trp rating creates new record on zee telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranthiki Vasthunam Trp Rating: టీఆర్పీ రేటింగ్స్‌లో దుమ్ము రేపిన సంక్రాంతికి వస్తున్నాం.. జీ తెలుగులో నయా రికార్డు

Sankranthiki Vasthunam TRP Rating: టీఆర్పీ రేటింగ్స్‌లో దుమ్ము రేపిన సంక్రాంతికి వస్తున్నాం.. జీ తెలుగులో నయా రికార్డు

Hari Prasad S HT Telugu

Sankranthiki Vasthunam TRP Rating: సంక్రాంతికి వస్తున్నాం మూవీ జీ తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ.. అటు ఓటీటీ, ఇటు టీవీలోనూ రికార్డులను తిరగరాస్తోంది.

టీఆర్పీ రేటింగ్స్‌లో దుమ్ము రేపిన సంక్రాంతికి వస్తున్నాం.. జీ తెలుగులో నయా రికార్డు

Sankranthiki Vasthunam TRP Rating: సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ చేసిన పని వాళ్లకు మంచి సక్సెస్ నే తెచ్చి పెట్టింది. తెలుగులో తొలిసారి ఒకే సమయంలో అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఈ సినిమాను తీసుకురావడంతో రెండింట్లోనూ మూవీ దుమ్ము రేపుతోంది. తాజాగా టీవీ ప్రీమియర్ టీఆర్పీ రేటింగ్ లో ఈ మధ్యకాలంలో ఏ ఇతర సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం టీఆర్పీ రేటింగ్

సంక్రాంతికి వస్తున్నాం మూవీ మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ అయింది. ఈ సినిమాకు ఏకంగా 15.92 రేటింగ్ నమోదు కావడం విశేషం.

ఇది కేవలం జీ తెలుగు ఎస్‌డీ ఛానెల్లోనే. ఇక జీ తెలుగు హెచ్‌డీలో మరో 2.3 రేటింగ్ వచ్చింది. మొత్తంగా చూస్తే 18కిపైనే రేటింగ్ నమోదైనట్లు లెక్క. ఈ మధ్య కాలంలో మరే తెలుగు సినిమాకు ఇంత రేటింగ్ నమోదు కాలేదు.

వర్కౌటైన ప్లాన్

నిజానికి కొంత కాలంగా అన్ని సినిమాలు మొదట ఓటీటీలో అడుగుపెట్టిన కొంత కాలానికి టీవీ ఛానెల్లోకి వస్తున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం తెలుగులో ఈ ఆనవాయితీని బ్రేక్ చేసింది. ఒకే రోజు ఒకే సమయానికి అటు ఓటీటీలో, ఇటు టీవీలోకి సినిమాను తీసుకొచ్చింది.

చాలా వరకు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత టీవీలోకి వస్తుండటంతో ఈ మధ్య టీఆర్పీలు దారుణంగా ఉంటున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీవీలో ప్రసారమయ్యే క్షణంలోనే ఓటీటీలోకి కూడా వచ్చింది. దీంతో టీవీ ఛానెల్లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రికార్డు టీఆర్పీ నమోదు కావడానికి ఇదే కారణం అని చెప్పొచ్చు.

ఓటీటీలోనూ రికార్డులే

ఇక జీ5 ఓటీటీలోనూ ఈ సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 1 సాయంత్రం 6 గంటలకే అందుబాటులోకి వచ్చింది. తొలి 12 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసి ఆర్ఆర్ఆర్, హనుమాన్ లాంటి సినిమాల రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత 200 మిలియన్లు, 300 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డులను కూడా అందుకుంది. ఇప్పటికీ ఓటీటీలో దూసుకెళ్తూనే ఉంది. జీ5 ఓటీటీలో నంబర్ వన్ ట్రెండింగ్ మూవీ ఇదే.

ఆ లెక్కన సంక్రాంతికి థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి ఓటీటీ, టీవీ వరకూ ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రతి రికార్డునూ తిరగరాస్తూనే ఉందని చెప్పొచ్చు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం