Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి.. ఎప్పుడు రానుందంటే?
Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
Sankranthiki Vasthunam OTT: వెంకటేశ్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు వసూలు చేసి.. వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక అటు ఈ మూవీ ఓటీటీ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తాజాగా మరో అప్డేట్ వస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హక్కులను ఆ ఓటీటీ ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. ఇక మూవీ థియేటర్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆ లెక్కన ఫిబ్రవరి మూడో వారంలో మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉండొచ్చని భావిస్తున్నారు.
వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 కూడా బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్స్ గా నటించారు. దిల్ రాజు నిర్మించాడు. భీమ్స్ సీసిరోలియో అందించిన మ్యూజిక్ మూవీకి హైలైట్ గా నిలుస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉందంటే?
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వచ్చిన మూవీ ఈ సంక్రాంతికి వస్తున్నాం. గతంలో వెంకటేశ్ కు ఎక్కువగా సక్సెస్ అందించిన ఈ జానర్ ఇప్పుడు కూడా అతని ఆశలను వమ్ము చేయలేదు. ఈ మూవీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా వెంకటేశ్ నటించాడు. వెంకటేశ్, అనిల్ రావిపూడి కలిస్తే కామెడీ ఏం రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో ప్రూవ్ అయ్యింది.
ఈ సారి కేవలం కామెడీకే పరిమితం కాకుండా క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీని తీసుకొచ్చాడు. అయితే అతని సినిమాల్లో లాజిక్ కంటే మ్యాజికే ఎక్కువగా ఉంటుంది. ఈ మూవీ కూడా అందుకు మినహాయింపు కాదు. అలా లాజిక్ లను కాకుండా మూవీలోని ఫన్ ను మాత్రం ఆస్వాదిస్తూ చూస్తే మాత్రం ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.