Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్‍పై లేటెస్ట్ రూమర్లు
Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే నిరీక్షణ కొనసాగుతోంది. ముందుగా ఈ చిత్రం టీవీలో రానుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ రూమర్ బయటికి వచ్చింది.

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. అందరి అంచనాలను దాటేసి కలెక్షన్లను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ కామెడీ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. పాజిటివ్ టాక్‍తో కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలోకి ఇంకా రాలేదు. టీవీ ఛానెల్‍లోకే ముందు అడుగుపెట్టనుంది. ఈ తరుణంలో తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‍పై రూమర్లు బయటికి వచ్చాయి.
టీవీలో వచ్చిన రెండు రోజుల్లోనే ఓటీటీలో..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ5 తెలుగు ఛానెల్ తీసుకుంది. ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే టెలికాస్ట్ చేయనున్నట్టు ఇటీవల జీ తెలుగు ప్రకటించింది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. టీవీలో టెలికాస్ట్ అయిన రెండు రోజుల్లోగానే సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా టెలికాస్ట్ డేట్‍ను జీ తెలుగు ఛానెల్ ఇంకా ప్రకటించలేదు. త్వరలో అంటూ ఊరిస్తోంది. అతిత్వరలో డేట్ వెల్లడించే అవకాశం ఉంది. అయితే, టెలికాస్ట్ ఎప్పుడైనా.. దానికి రోజుల వ్యవధిలో జీ5లోకి ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తుందని తాజాగా సమాచారం వెల్లడైంది. టెలికాస్ట్ డేట్‍ను జీ తెలుగు ప్రకటిస్తే.. స్ట్రీమింగ్‍పై కూడా క్లారిటీ రానుంది.
రూ.300కోట్లు దాటేసి..
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటిందని మూవీ టీమ్ ఇటీవలే వెల్లడించింది. టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లతో ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిందని వెల్లడించింది. వెంకటేశ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది. ఆయన తొలిసారి రూ.300కోట్ల మార్క్ సాధించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ స్థాయి వసూళ్లను సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్లను కూడా జోరుగా చేసింది. విక్టరీ వేడుక పేరుతో సక్సెస్ మీట్‍ను కూడా నిర్వహించింది. ఊహించిన దాని కంటే ఎక్కువ బ్లాక్‍బస్టర్ చేశారంటూ వెంకటేశ్ కూడా అన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మాజీ ఐపీఎస్ వైడీ రాజు పాత్రలో కామెడీతో అదరగొట్టారు వెంకీ. మరోసారి తన మార్క్ చూపారు. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు అనిల్ రావిపూడి. పండగకు సూటయ్యేలా తీసుకొచ్చారు.
ఈ మూవీలో మురళీధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, సాయికుమార్, శ్రీనివాస్ అవసరాల, నరేశ్, మాస్టర్ రేవంత్, ఉపేంద్ర లిమాయే, వీటీవీ గణేశ్, కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ముందు నుంచి బజ్ వచ్చేందుకు పాటలు చాలా ఉపయోగపడ్డాయి. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ జోరుగా చేసింది. సినిమా కూడా ఆకట్టుకోవటంతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది.
సంబంధిత కథనం