Sankranthi Movies Winners: సంక్రాంతి సినిమాల విజేతలు.. 2000 నుంచి 2024 వరకు.. ఒక్కడు నుంచి హనుమాన్ వరకు..
Sankranthi Movies Winners: సంక్రాంతి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పండుగకు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడాలని పెద్ద పెద్ద హీరోలు కూడా తహతహలాడుతుంటారు. అయితే 2000 నుంచి 2024 వరకు ఈ సంక్రాంతి సినిమాల్లో విజేతలుగా నిలిచిన మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.
Sankranthi Movies Winners: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడి పందేలు, గాలి పటాలే కాదు.. సినిమాల హడావిడి కూడా ఉంటుంది. టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాలుగా సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఇప్పటి అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వరకు.. సంక్రాంతి బరిలో నిలిచి విజేతలైన వాళ్లే. ఈ సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న వేళ.. 2000 నుంచి 2024 వరకు సంక్రాంతి విజేతలుగా నిలిచిన మూవీస్ ఏవో చూడండి.
సంక్రాంతి సినిమాలు
టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజ్ మరే సమయంలోనూ ఉండదు. ప్రతి ఏడాది కనీసం మూడు, నాలుగు, ఐదు, ఆరు.. ఇలా చిన్నా, పెద్దా కలిపి సినిమాలు క్యూ కడతాయి. వాటిలో కొన్ని మాత్రమే విజేతలుగా నిలుస్తాయి. ఈ ఏడాది కూడా భారీ అంచనాలు, ఎన్నో ఆశలతో మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈసారి బాక్సాఫీస్ పోటీకి సిద్ధపడుతున్నాయి. వీటిలో ఈసారి గెలిచేదెవరన్న ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ తో మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీకే వీటిలో ఎక్కువ హైప్ ఉందనడంలో సందేహం లేదు. అందుకు తగినట్లే ఈ మూడు సినిమాల్లో ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశాలు కూడా దీనికే ఉన్నట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి మూవీస్ లో అన్నింటి కంటే ముందుగా జనవరి 10నే ఈ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత జనవరి 12న డాకు మహారాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడింట్లో ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి. గతేడాది అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హనుమాన్ విజేతగా నిలిచింది. అంతేకాదు 90 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి మూవీ కూడా ఇదే. మరి ఈసారి ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ఉంది.
సంక్రాంతి విజేతలు.. కలిసుందాం రా నుంచి హనుమాన్ వరకు..
2000వ ఏడాది నుంచి 2024 వరకు సంక్రాంతి సినిమాల్లో విజేతలుగా నిలిచిన సినిమాల జాబితా ఇదీ..
2000 - కలిసుందాం రా
2001 - నరసింహ నాయుడు
2002 - నువ్వు లేక నేను లేను
2003 - ఒక్కడు
2004 - వర్షం
2005 - నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2006 - లక్ష్మి
2007 - దేశముదురు
2008 - కృష్ణ
2009 - అరుంధతి
2010 - అదుర్స్
2011 - మిరపకాయ్
2012 - బిజినెస్ మ్యాన్
2013 - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
2014 - ఎవడు
2015 - గోపాల గోపాల
2016 - సోగ్గాడే చిన్ని నాయన
2017 - ఖైదీ నంబర్ 150
2018 - జై సింహా
2019 - ఎఫ్2
2020 - అల వైకుంఠపురంలో
2021 - క్రాక్
2022 - బంగార్రాజు
2023 - వాల్తేర్ వీరయ్య
2024 - హనుమాన్
టాపిక్