Balakrishna vs Venkatesh: ఇప్పటివరకు సంక్రాంతికి పోటీపడ్డ బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఇవే - ఎవరిది పై చేయి అంటే?
Balakrishna vs Venkatesh:ఈ సారి సంక్రాంతి బరిలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం....బాలకృష్ణ డాకు మహారాజ్‌తో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిలిచాయి. రెండోసారి సంక్రాంతి పోరులో ఈ ముగ్గురు హీరోల సినిమాలు నిలవబోతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
సంక్రాంతికి స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడే ట్రెండ్ టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ప్రతిసారి లాగే ఈ సారి సంక్రాంతి పోరు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఈ సంక్రాంతి విన్నర్‌గా యంగ్ హీరో నిలుస్తాడా...సీనియర్ హీరోలు గెలుస్తారా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇది రెండోసారి...
సంక్రాంతికి బాలకృష్ణ, వెంకటేష్, రామ్‌చరణ్ సినిమాలు బరిలో నిలవడం ఇది రెండోసారి. 2019 సంక్రాంతికి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయవిధేయ రామతో పాటు వెంకటేష్ ఎఫ్ 2 సినిమాలు రిలీజయ్యాయి. బాలకృష్ణ, రామ్‌చరణ్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవగా...వెంకటేష్ ఎఫ్ 2 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
వెంకటేష్ వర్సెస్ బాలకృష్ణ...
2019 కంటే ముందు బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు పలుమార్లు సంక్రాంతి పోటీపడ్డాయి. ఇద్దరికి ఈ పండుగ కెరీర్‌లో మర్చిపోలేని విజయాల్ని అందించింది. పరాజయాల్ని అందించింది.
వెంకటేష్‌దే విజయం...
2000 ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ వంశోద్దారకుడు, వెంకటేష్ కలిసుందాం రా సినిమాలు రిలీజయ్యాయి. వంశోద్ధారకుడు మాస్ కథాంశంతో తెరకెక్కగా... కలిసుందాం రా ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. బాలకృష్ణ మూవీని తిప్పికొట్టిన ఆడియెన్స్ వెంకటేష్ సినిమాను హిట్ చేశారు. అదే ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి అన్నయ్య కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
దేవి పుత్రుడు...
2001లో మరోసారి బాలకృష్ణ నరసింహానాయుడు, వెంకటేష్ దేవీపుత్రుడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందిన దేవీపుత్రుడు ప్రేక్షకుల్ని మెప్పించలేక బోల్తా కొట్టింది. అదే టైమ్‌లో నరసింహనాయుడు బాలకృష్ణ కెరీర్‌లో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాలతో పోటీగా వచ్చిన చిరంజీవి మృగరాజు డిజాస్టర్‌గా నిలిచింది.
సంక్రాంతి క్లాష్‌కు బ్రేక్...
2001 తర్వాత బాలకృష్ణ, వెంకటేష్ సంక్రాంతి క్లాష్‌కు బ్రేక్ పడింది. ఎవరో ఒకరి సినిమానే సంక్రాంతికి రిలీజ్ అవుతూ వచ్చాయి. 2002లో పండుగ సీజన్‌లో బాలకృష్ణ సీమసింహం సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. 2004లో మాత్రం లక్ష్మి నరసింహ మూవీతో పండుగ విజేతగా బాలయ్యరికార్డులను తిరగరాశాడు. . 2006 సంక్రాంతికి లక్ష్మితో వెంకటేష్ హిట్ దక్కించుకున్నాడు.
ఒక్క మగాడు...
2008 సంక్రాంతి సీజన్ బాలకృష్ణకు అంతగా అచ్చి రాలేదు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన అక్క మగాడు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2010 సంక్రాంతికి నమో వెంకటేష్‌తో వెంకటేష్ సక్సెస్ దక్కించుకోగా...2011లో వచ్చిన బాలకృష్ణ పరమవీర చక్ర డిసపాయింట్ చేసింది.
మల్టీస్టారర్ మూవీ...
2013లో రామ్‌చరణ్ ఎవడు, వెంకటేష్, మహేష్‌బాబు మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు పండుగ బరిలో నిలిచాయి. సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలివగా...నాయక్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఎవడు యావరేజ్ నిలిచింది.
గోపాల గోపాల…
2014లో సంక్రాంతి సెంటిమెంట్ వెంకటేష్‌కు కలిసి వచ్చింది. గోపాల గోపాల ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించింది. పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్‌లో కనిపించడం ఈ సినిమా ప్లస్సయ్యింది.
2017 తో పాటు 2023 సంక్రాంతికి చిరంజీవితో బాలకృష్ణ పోటీపడ్డారు. ఈ పోరులో బాలకృష్ణకు రెండు సార్లు సక్సెస్‌లు దక్కాయి. 2017లో రిలీజైన గౌతమి పుత్ర శాతకర్ణి, 2023లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టాయి.