OTT: ఓటీటీలోకి సరికొత్త ఫీల్ గుడ్ మూవీ 'ప్రేమ విమానం'.. ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Prema Vimanam Web Film OTT: నేటి తరంలో ఓటీటీల హవా జోరుగా సాగుతోంది. అందుకే పోటీ పడి మరి డిజిటల్ ప్లాట్‍ఫామ్స్ వరుసగా సినిమాలు, సిరీసులు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి మరో సరికొత్త మూవీ 'ప్రేమ విమానం' రానుంది.
Prema Vimanam OTT: ఓటీటీ ప్రియులకు చూడచక్కని స్టోరీలతో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులను తెరెకక్కిస్తున్నాయి డిజిటల్ ప్లాట్‍ఫామ్స్. అలాంటి వాటిలో జీ5 ఒకటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, గుజరాతి తదితర భాషల్లో వినోదాన్ని అందిస్తోంది. తాజాగా జీ5లోకి మరో కొత్త సినిమా రానుంది. భారీ బడ్జెట్స్ తో సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ సంయుక్తంగా రూపొందించి వెబ్ ఫిల్మ్ 'ప్రేమ విమానం'. అంటే దీన్ని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
'ప్రేమ విమానం' అనే ఈ వెబ్ ఫిల్మ్ అక్టోబర్ 13న జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన సంఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులతో కూడిన అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ మూవీపై ఆసక్తిని పెంపొందించాయి.
ప్రేమ విమానం వెబ్ మూవీకి సంతోష్ కటా దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‍గా వర్క్ చేశారు. ఇందులో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించగా.. చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా యాక్ట్ చేశారు. అలాగే వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కాగా సంగీత్ శోభన్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అవుతోంది.