మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో హీరోగా పెద్ద విజయాలను అందుకున్నాడు సంగీత్ శోభన్. ఈ రెండు సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సారి రూట్ మార్చిన సంగీత్ శోభన్ ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే సోలోగా థియేటర్లలోకి రాబోతున్నాడు.
సంగీత్ శోభన్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీకి గ్యాంబ్లర్స్ అనే టైటిల్ ఫిక్సయింది. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జబర్ధస్థ్ కమెడియన్, కేసీఆర్ మూవీ ఫేమ్ రాకింగ్ రాకేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటిస్తోంది.
గ్యాంబ్లర్స్ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫోస్ట్‌లుక్ పోస్టర్‌లో సూట్ ధరించి చేతిలో గన్ పట్టుకొని డిఫరెంట్ లుక్‌లో సంగీత్ శోభన్ కనిపిస్తున్నాడు. జూన్ 6న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
గ్యాంబ్లర్స్ మూవీ గురించి కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సంగీత్ శోభన్ పాత్ర కొత్తగా ఉంటుంది. నటుడిగా అతడిని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తోన్నాడు.కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ క్యారెక్టర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ '' మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో సంగీత్ శోభన్‌కు యూత్ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గత చిత్రాలకు భిన్నమైన క్యారెక్టర్‌ను గ్యాంబ్లర్స్‌లో చేస్తున్నాడు. న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకముంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి అని చెప్పారు.
గ్యాంబ్లర్స్ మూవీని సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్నారు. గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన శ్రీవల్లి సినిమాకు సునీత, రాజ్‌కుమార్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. గ్యాంబ్లర్స్ మూవీలో పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, ,జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మ్యాడ్ స్క్వేర్ మూవీలో సంతోష్ శోభన్‌తో పాటు నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. పదహారు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అరవై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
సంబంధిత కథనం