Salman Khan: అవును.. సల్మాన్ ఖాన్‌తో నా పెళ్లి కార్డులు కూడా ప్రింటయ్యాయి: అజారుద్దీన్ మాజీ భార్య కామెంట్స్ వైరల్
Salman Khan: సల్మాన్ ఖాన్ తో పెళ్లి, వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింటైన విషయం నిజమే అని చెప్పింది టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ. సోనీలో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్ షోకి వచ్చిన ఆమె.. ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది.
Salman Khan: సల్మాన్ ఖాన్ ఎంతో మందితో డేటింగ్ చేసినా ఇప్పటి వరకూ బ్రహ్మచారిగానే ఉన్నాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ చాలా మంది హీరోయిన్లతో అతనికి ఎఫైర్ నడిచింది. వాళ్లలో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ. సల్మాన్ తో పెళ్లి విషయం నిజమే అని, కార్డులు కూడా ప్రింటైన విషయాన్ని ఆమె చెబుతూ.. ఆ పెళ్లి రద్దయినట్లు వెల్లడించింది.
సల్మాన్‌తో పెళ్లిపై సంగీతా ఏమన్నదంటే..
సోనీ టీవీలో వచ్చే ప్రముఖ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ (Indian Idol). ఈ మ్యూజిక్ షో 15వ సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. శనివారం (డిసెంబర్ 28) ప్రసారమైన ఎపిసోడ్ కు సంగీతా బిజ్లానీ గెస్టుగా వచ్చింది. ఈ సందర్భంగా మానసి ఘోష్ అనే కంటెస్టెంట్ ఆమెను ఓ ప్రశ్న అడిగింది. సల్మాన్ ఖాన్ తో పెళ్లికి వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింటయ్యాయట.. నిజమేనా అని ఆమె ప్రశ్నించింది.
దీనికి సంగీతా స్పందిస్తూ.. ఇది అబద్ధమైతే కాదు అని చెప్పడం గమనార్హం. ఇక చాలు.. నా పేరు బిజిలానీ కానీ నాపై బిజిలీ (పిడుగు) ఎందుకు వేస్తున్నారు అని ఆమె సరదాగా అడిగింది. ఆ సమయంలో పక్కనే జడ్జిగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందిస్తూ.. అసలు ఏం జరిగింది?ఆ స్టోరీ ఏంటో చెబుతారా అని అడిగాడు. కానీ దీనికి తర్వాత చెబుతానంటూ సంగీత సమాధానం దాటవేసింది. అంతకుముందు మరో కంటెస్టెంట్ ఆమెను తన జీవితంలో జరిగిన వాటిలో ఏ విషయాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు.
దీనికి సంగీత స్పందిస్తూ.. తన మాజీ తనను షార్ట్ డ్రెస్సులు వేసుకోనిచ్చేవాడు కాదంటూ చెప్పుకొచ్చింది. ఆ మాజీ ఎవరు అని విశాల్ అడుగుతున్నా.. పేరు చెప్పనని ఆమె అన్నది. తన డ్రెస్సింగ్ విషయంలో ఇబ్బంది పెట్టాడని, షార్ట్ డ్రెస్సులు వేసుకోవద్దంటూ రూల్ పెట్టాడని, ఇప్పుడు తనకు అలాంటి రూల్స్ ఏమీ లేవని, ఇష్టమున్న డ్రెస్సులు వేసుకుంటున్నట్లు సంగీతా బిజ్లానీ తెలిపింది. అయితే ఆమెకు రూల్స్ పెట్టిన ఆ మాజీ ఎవరన్నదానిపై చర్చ నడుస్తోంది.
సంగీతా బిజ్లానీ ఎఫైర్లు ఇలా..
సంగీతా బిజ్లానీ ఓ మోడల్, బాలీవుడ్ నటి. ఆమె సల్మాన్ ఖాన్ తో చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసింది. వీళ్ల పెళ్లి కూడా జరగబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఆ పెళ్లి రద్దయింది. ఇద్దరూ విడిపోయారు. పదేళ్ల పాటు వీళ్లు రిలేషన్షిప్ లో ఉండటం విశేషం. సల్మాన్ చాలా ఎక్కువ కాలం కొనసాగించి రిలేషన్షిప్ ఇదే. ఆ తర్వాత 1996లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ను సంగీత పెళ్లి చేసుకుంది.
23 ఏళ్ల పాటు కలిసున్న వీళ్లు 2019లో విడిపోయారు. అయితే ఇప్పటికీ సల్మాన్ తో ఆమె క్లోజ్ గా ఉంది. అతడు ఆర్గనైజ్ చేసే పార్టీలకు కూడా వెళ్తుంది. దీనిగురించే గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పార్ట్‌నర్స్ మధ్య ప్రేమ ఎప్పటికీ పోదని, జీవితంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారని, ఎవరూ శాశ్వతం కాదని ఆమె అనడం గమనార్హం.