Sandeep Reddy Vanga: యానిమల్ పిల్లలు చూసే సినిమా కాదు.. నా కొడుకుకు కూడా చూపించను: సందీప్ రెడ్డి వంగా-sandeep reddy vanga says animal is not for children ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sandeep Reddy Vanga: యానిమల్ పిల్లలు చూసే సినిమా కాదు.. నా కొడుకుకు కూడా చూపించను: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: యానిమల్ పిల్లలు చూసే సినిమా కాదు.. నా కొడుకుకు కూడా చూపించను: సందీప్ రెడ్డి వంగా

Hari Prasad S HT Telugu

Sandeep Reddy Vanga: యానిమల్ మూవీపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా పిల్లలు చూసేది కాదని, తన కొడుకుకు కూడా చూపించనని అనడం విశేషం.

యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శక ధీరుడు రాజమౌళితో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: యానిమల్ మూవీకి సీబీఎఫ్‌సీ వాళ్లు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనడం గమనార్హం. ఈ సినిమా పిల్లలు చూసేది కాదని అతడు స్పష్టం చేశాడు. వచ్చే శుక్రవారం (డిసెంబర్ 1) యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాపై అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అర్జున్ రెడ్డి మూవీతో పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో తీశాడు. ఇప్పుడు యానిమల్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే విపరీతమైన వయోలెన్స్ ఉండటంతో ఊహించినట్లే సెన్సార్ బోర్డు కూడా ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.

యానిమల్‌కు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషం: సందీప్

అయితే తన సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇవ్వడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి మాత్రం సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా లేదని అతడు అనడం విశేషం. ది హిందూతో అతడు మాట్లాడాడు. "యానిమల్ విషయానికి వస్తే సినిమాకు ఎ సర్టిఫికెట్ రావడం సంతోషం.

18 ఏళ్ల లోపు వారికి ఇది సూటయ్యే సినిమా కాదు. నా కొడుకు అర్జున్, నా సోదరుడి పిల్లలు లేదంటే కజిన్స్ పిల్లలను కూడా థియేటర్లలో సినిమాకు తీసుకెళ్లను. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. నా కుటుంబంలో 8 నెలల నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు చాలా మందే ఉన్నారు" అని సందీప్ రెడ్డి చెప్పాడు.

ఇక సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపైనా స్పందించాడు. ఈ సినిమా రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్లు వసూలు చేస్తుందా అని ప్రశ్నించగా.. వసూళ్లు గురించి ఇప్పుడే అంచనాలు వేయలేనని, అయితే సినిమా మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుందని అన్నాడు. యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించారు.

ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుండగా.. సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు.