పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే హైప్ విపరీతంగా ఉంది. యానిమల్‍తో బ్లాక్‍బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో క్రేజ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. స్పిరిట్ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే నిరీక్షణ సాగుతోంది. ఈ తరుణంలో నేడు (మార్చి 30) ఉగాది సందర్భంగా ఈ మూవీ షూటింగ్ గురించి డైరెక్టర్ సందీప్ ఓ అప్‍డేట్ ఇచ్చారు.
స్పిరిట్ షూటింగ్ మెక్సికోలో జరగనుందని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అమెరికాలో జరిగిన ఉగాది వేడుకలకు హాజరైన ఆయన అప్‍డేట్ ఇచ్చారు. మెక్సికోలో షూటింగ్ లొకేషన్ల కోసం అన్వేషించామని సందీప్ రెడ్డి చెప్పారు.
దీంతో స్పిరిట్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మెక్సికోలో జరగనుందని అర్థమైపోయింది. త్వరలోనే చిత్రీకరణ మొదలుకానుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో ఇంటర్నేషనల్ రేంజ్‍లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే స్కిప్ట్ పనులను సందీప్ పూర్తిచేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ది రాజాసాబ్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా రూపొందుతోంది. ఏప్రిల్‍లో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. హను రాఘవపూడి దర్శత్వంలో ఓ పీరియడ్ యాక్షన్ సినిమాలోనూ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. స్పిరిట్‍ను ప్రభాస్ మొదలుపెట్టే అవకాశం ఉంది.
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ ఓ మూవీకి ప్రభాస్ ఓకే చెప్పారు. స్పిరిట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయనున్నారు. సలార్ 2, కల్కి 2 కూడా లైనప్‍లో ఉన్నాయి. మొత్తంగా వరుస ప్రాజెక్టులతో రెబల్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్ని ప్రాజెక్టుల్లోనూ స్పిరిట్‍పైనే స్పెషల్ హైప్ ఉంది. బోల్డ్‌గా, డేరింగ్‍గా సినిమాలను తెరకెక్కించే సందీప్.. ప్రభాస్‍ను ఎలా చూపిస్తారా అనే ఆసక్తి విపరీతంగా ఉంది.
స్పిరిట్ చిత్రంలో పవర్‌ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించనున్నారు. ఈ విషయాన్ని సందీప్ గతంలోనే కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఏడాది 2026లో ఈ మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
సంబంధిత కథనం