Bollywood: అప్పట్లో ప్లాఫ్.. రీ-రీలీజ్‍లో సెన్సేషన్.. రెండు రోజుల్లోనే లైఫ్‍టైమ్ కలెక్షన్లను దాటిన బాలీవుడ్ చిత్రం-sanam teri kasam movie crosses lifetime box office collection in rerelease in just two days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bollywood: అప్పట్లో ప్లాఫ్.. రీ-రీలీజ్‍లో సెన్సేషన్.. రెండు రోజుల్లోనే లైఫ్‍టైమ్ కలెక్షన్లను దాటిన బాలీవుడ్ చిత్రం

Bollywood: అప్పట్లో ప్లాఫ్.. రీ-రీలీజ్‍లో సెన్సేషన్.. రెండు రోజుల్లోనే లైఫ్‍టైమ్ కలెక్షన్లను దాటిన బాలీవుడ్ చిత్రం

Sanam Teri Kasam Re-release: సనమ్ తేరి కసమ్ చిత్రం రీ-రిలీజ్‍లో దుమ్మురేపుతోంది. తొలుత రిలీజైనప్పుడు ప్లాఫ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఆశ్చర్యపరిచే కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Bollywood: అప్పట్లో ప్లాఫ్.. రీ-రీలీజ్‍లో సెన్సేషన్.. రెండు రోజుల్లోనే లైఫ్‍టైమ్ కలెక్షన్లను దాటిన బాలీవుడ్ చిత్రం

తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణే, మావ్రా హొకానే హీరీహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ ‘సనమ్ తేరి కసమ్’ 2016 ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ హిందీ రొమాంటిక్ డ్రామా మూవీ ఇప్పట్లో బోల్తా కొట్టింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్‍గా డిజాస్టర్ అయింది. అయితే, ఆ చిత్రం ఇప్పుడు సుమారు తొమ్మిదేళ్లకు థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. గత వారం ఫిబ్రవరి 7న మళ్లీ థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే, రీ-రిలీజ్‍లో సనమ్ తేరి కసమ్ సెన్సేషనల్ కలెక్షన్లు సాధిస్తోంది.

రెండు రోజుల కలెక్షన్లు ఇవే

సనమ్ తేరి కసమ్ సినిమా రీ-రిలీజ్‍లో ఆశ్చర్యపరిచే కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.9.5 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాపులర్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ కూడా రీ-రిలీజ్ సహా రెండు కొత్త చిత్రాలు పోటీలో ఉన్నా.. సనమ్ తేరి కసమ్ వసూళ్లలో జోరు చూపిస్తోంది.

రెండు రోజుల్లోనే లైఫ్‍టైమ్ కలెక్షన్లు దాటి..

సనమ్ తేరి కసమ్ చిత్రం 2016లో రిలీజైన సమయంలో ఫుల్ రన్‍లో ఇండియాలో దాదాపు రూ.9కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. డిజాస్టర్ అయింది. అయితే, ఇప్పుడు రీ-రిలీజ్‍లో రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.9.5 కోట్ల నెట్ కలెక్షన్లను దాటేసింది. తొలుత రిలీజైనప్పటి లైఫ్‍టైమ్ కలెక్షన్లను.. ఇప్పుడు రీ-రిలీజ్‍లో రెండు రోజుల్లోనే దాటేసింది ఈ మూవీ. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు వసూళ్లను రాబడుతోంది. 

సనమ్ తేరి కసమ్ చిత్రం రీ-రిలీజ్‍లో గత శుక్రవారం తొలి రోజు సుమారు రూ.4.25కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. శనివారమైన రెండో రోజు వృద్ధి కనబరిచి రూ.5.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ మూవీ ఆదివారం కూడా మంచి కలెక్షన్లను దక్కించుకునే అవకాశం ఉంది. బుకింగ్స్ కూడా బాగా సాగుతున్నాయి. 

సనమ్ తేరి కసమ్ మూవీకి రాధికా రావ్, వినయ్ సప్రు దర్శకత్వం వహించారు. బాలీవుడ్‍లో సెటిల్ అయిన తెలుగు నటుడు హర్షవర్దన్ రాణే.. ఇందర్ లాల్ పరిహార్‌ పాత్రను ఈ మూవీలో పోషించారు. అతడికి జోడీగా మావ్రా నటించారు. మనీశ్ చౌదరి, ప్యుమోరీ మెహతా ఘోష్, మురళీ శర్మ, సుదేశ్ బెర్రీ, దివ్యేత్తా సింగ్, శ్రద్ధా దాస్, అనురాగ్ నిన్హా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.

సనమ్ తేరి కసమ్ చిత్రాన్ని జోమ్ జోమ్ ప్రొడక్షన్స్, సోహమ్ రాక్‍స్టార్ ప్రొడక్షన్స్ పతాకాలపై డైరెక్టర్లు రాధిక, వినయే ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమాకు హిమేశ్ రేష్మియా మ్యూజిక్ అందించారు.

సంబంధిత కథనం