Sampoornesh Babu: మార్టిన్ లూథ‌ర్ కింగ్‌గా రానున్న సంపూర్ణేష్ బాబు - త‌మిళ రీమేక్‌తో రీఎంట్రీ-sampoornesh babu re entry in to tollywood with martin luther king movie release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sampoornesh Babu Re Entry In To Tollywood With Martin Luther King Movie Release Date Locked

Sampoornesh Babu: మార్టిన్ లూథ‌ర్ కింగ్‌గా రానున్న సంపూర్ణేష్ బాబు - త‌మిళ రీమేక్‌తో రీఎంట్రీ

HT Telugu Desk HT Telugu
Sep 19, 2023 11:44 AM IST

Sampoornesh Babu: పొలిటిక‌ల్ కామెడీ మూవీతో చాలా రోజుల విరామం త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాకు మార్టిన్ లూథ‌ర్ కింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథ‌ర్ కింగ్‌
సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథ‌ర్ కింగ్‌

Sampoornesh Babu: హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట సినిమాతో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. స్ఫూఫ్ కామెడీతో రూపొందిన ఈ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అయ్యాయి. హృద‌య‌కాలేయం క్రేజ్‌తో సంపూర్ణేష్‌బాబు తెలుగులో చాలా సినిమాలే చేసినా విజ‌యాల్ని మాత్రం అందుకోలేక‌పోయాడు.

ట్రెండింగ్ వార్తలు

లాంగ్ గ్యాప్ త‌ర్వాత పొలిటిక‌ల్ కామెడీ మూవీతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు మార్టిన్ లూథ‌ర్ కింగ్ అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. సంపూర్ణేష్‌బాబు త‌ల‌పై కిరీటం ఉండ‌టం, అందులో కొంత‌మంది నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌చారం చేస్తోన్న‌ట్లుగా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ఆస‌క్తిని పంచుతోంది.

మార్టిన్ లూథ‌ర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు డైరెక్ట‌ర్ వెంక‌టేష్ మ‌హా, న‌రేష్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 27న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా ఈ సినిమా ఓ కోలీవుడ్ రీమేక్ అని స‌మాచారం. త‌మిళంలో యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మండేలా సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది.

బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కానీ తుది నామినేష‌న్స్ చోటు ద‌క్క‌లేదు. రెండు నేష‌న‌ల్ అవార్డ్స్‌ను కూడా మండేలా సినిమా గెలుచుకున్న‌ది.

మండేలా సినిమా ఆధారంగానే మార్టిన్ లూథ‌ర్ కింగ్రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. పంచాయ‌తీ ఎల‌క్ష‌న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. మార్టిన్ లూథ‌ర్ కింగ్ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.